ANKURARPANAM HELD _ శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

TIRUPATI, 10 FEBRUARY 2023:The Ankurarpanam fete for annual brahmotsavams in Sri Kapileswara Swamy temple was held on Friday evening.

Dhwajarohanam will be observed on Saturday in the auspicious Meena Lagnam at 8:54 am.

Every day there will be Vahana Sevas both in the mornings and evenings between 8 am – 10 am and 8 pm-10 pm respectively.

TTD JEO Sri Veerabrahmam, DyEO Sri Devendra Babu, AEO Sri Partasaradhi, Superintendent Sri Bhupati, and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

– ఫిబ్రవరి 11న ధ్వజారోహణం

  తిరుపతి, 10 ఫిబ్రవరి 2023 ; తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఫిబ్ర‌వ‌రి 11 నుండి మార్చి 20వ తేదీ వరకు ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ అనంతరం మొదటిసారిగా పురవీధుల్లో వాహనసేవలు నిర్వ‌హిస్తారు.

అంకురార్ప‌ణం సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ త‌రువాత శాస్త్రోక్తంగా అంకురార్పణం జ‌రిగింది.

ఫిబ్ర‌వ‌రి 11న ధ్వజారోహణం :
     
ఫిబ్ర‌వ‌రి 11న ఉదయం 8.54 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. అనంతరం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.

ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు పురవీధుల్లో వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో జెఈఓ శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థ సారధి , సూపరింటెండెంట్ శ్రీ భూపతి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.