AP CM OFFERS PRAYERS IN TIRUCHANOOR TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు
తిరుపతి, 13 జూన్ 2024: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు గురువారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయం ఎదుట టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం గౌ|| ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం శ్రీ నారా చంద్రబాబునాయుడు దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి, వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో గౌ|| ముఖ్యమంత్రికి జేఈవో శ్రీ వీరబ్రహ్మం అమ్మవారి ప్రసాదాలు, వస్త్రం అందచేశారు.
అనంతరం శ్రీవారి, అమ్మవారి దర్శన ఏర్పాట్లు బాగున్నాయని గౌ|| ముఖ్యమంత్రి జేఈవో శ్రీ వీరబ్రహ్మంకు కితాబు ఇచ్చారు.
ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్ , ఆగమ సలహాదారుశ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబు స్వామి పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.