ANKURARPANAM HELD _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ

TIRUPATI, 13 JUNE 2024: The Beejavapanam for the annual Pushpayagam was observed on Thursday evening in Sri Govindaraja Swamy temple in Tirupati.

As the annual Pushpayagam is scheduled on June 14, the Ankurarpanam fete was observed in the temple.

As a part of it, Senadhipathi Utsavam was held in a religious manner followed by seed sowing ritual.

Temple DyEO Smt Shanti, AEO Sri Munikrishna Reddy and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

ontent

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి 13,2024: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 14వ తేదీ శుక్రవారం జ‌రుగ‌నున్న‌ పుష్పయాగానికి గురువారం సాయంత్రం 6.30 నుండి సేనాధిప‌తి ఉత్స‌వం, శాస్ర్తోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా శ్రీ విష్వ‌క్సేనులవారు ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించారు. ఆ త‌రువాత అంకురార్పణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

శుక్రవారం ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు వీధి ఉత్సవం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్స్‌పెక్ట‌ర్ శ్రీ రాధాకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.