PUSHPA YAGAM OF APPALAYAGUNTA SRI PVST_ జూలై 18న అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం
Tirupati, 9 Jul. 19: The TTD plans to conduct Ankurarpanam on July 17 as part of the Annual Pushpa Yagam at Sri Prasanna Venkateswara Swamy Temple of Appalayagunta on July 18.
On July 18, after morning daily rituals the utsava idols of Lord and his consorts Sridevi and Bhudevi will be given snapana thirumanjanam with desi herbs and later grand Pushpa Yagam will be performed with aromatic leaves and colorful flowers.
The temple priests said the Pushpa yagam was performed to ward of evil impacts of any ritualistic lapses during the recently concluded Brahmotsavams of the temple. The celebrations will conclude in the evening with bright and colorful veedhi utsavam procession.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
జూలై 18న అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం
తిరుపతి, 2019 జూలై 09: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18వ తేదీన వార్షిక పుష్పయాగం వైభవంగా జరుగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విధంగానే ఇక్కడ పుష్పయాగం నిర్వహించనున్నారు.
జూలై 17వ తేదీ బుధవారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్పణం జరుగనుంది. జూలై 18వ తేదీ గురువారం ఉదయం 8.00 నుండి 10.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10.30 నుండి 12.00 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
ఇటీవల శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.