PARUVETA UTSAVAM AT SKVST_ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం
Srinivasa Mangapuram, 9 Jul. 19: The unique annual event of Paruveta utsavam, heralding Lord’s punishment of evil, was grandly celebrated at Sri Kalyana Venkateswara Temple, at the pedestal Srivari Meetu of Srinivasa Mangapuram.
As part of the festival, the utsava idols of the Lord were taken in procession to Paruveta mandapam in the forests nearby where Asthanam and other annual traditional rituals were conducted and the idols brought back to temple in the evening.
The artist of the TTD cultural wing Annamacharya Project performed Bhakti sankeertans, bhajans, kolatas, etc. and Annaprasadam was distributed to devotees.
TTDs local temple DyEO Sri Dhananjayulu, AEO Sri Lakshmiah, TTDs Agama advisor Sri Sundara Varada Bhattacharya, Superintendent Sri Muni Changalrayulu, Sri Ramanaiah, Chief Priest Sri Balaji Rangacharyulu, temple inspector Sri Anil Kumar, Sri Yogananda Reddy and others participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం
తిరుపతి, 2019 జూలై 09: సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారు నడిచిన మార్గంగా భక్తులు విశ్వసించే శ్రీవారి మెట్టు సమీపంలో మంగళవారం శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ముందుగా ఉదయం 9.00 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ ధనంజయులు, ఏఈవో శ్రీ లక్ష్మయ్య, టిటిడి ఆగమ సలహాదారు శ్రీ ఎన్.ఎ.కె.సుందరవరదన్, సూపరింటెండెంట్లు శ్రీ ముని చెంగల్రాయులు, శ్రీ రమణయ్య, ప్రధాన అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ అనిల్‌కుమార్, శ్రీ యోగానందరెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.