APPEAL TO DEVOTEES _ భక్తులకు విజ్ఞప్తి
Tirumala, 09 April 2022: TTD plans to stop issuing SSD (Slotted Sarva Darshan) tokens on Tuesday in view of the huge rush and delay in darshans.
In an appeal, TTD stated that as a result of the of summer week end rush, all those issued tokens on Saturday shall get Srivari Darshan on April 12, Tuesday only.
However, the SSD tokens for Wednesday will be issued just a day ahead i.e. from Tuesday afternoon onwards at the designated counters at Tirupati. Similarly, TTD said that henceforth no SSD tokens shall be issued for Srivari Darshan on Saturday and Sunday.
TTD has appealed to devotees to plan their pilgrimage accordingly.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తులకు విజ్ఞప్తి
తిరుమల, 2022 ఏప్రిల్ 09: తిరుపతిలోని కౌంటర్లలో ఈరోజు సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఏప్రిల్ 12వ తేదీ మంగళవారం నాటికి దర్శన స్లాట్ లభిస్తోంది. మంగళవారం నాటి స్లాట్ పూర్తి కాగానే టోకెన్ల జారీ నిలిపివేయడం జరుగుతుంది.
భక్తుల అధిక రద్దీ కారణంగా బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లు ఒక రోజు ముందు అనగా మంగళవారం మధ్యాహ్నం నుండి తిరుపతిలోని ఆయా కౌంటర్లలో కేటాయించడం జరుగుతుంది. కాగా, ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లు కేటాయించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.