SERVE DEVOTEES WITH DEDICATION- TTD ADDITIONAL EO _ రాములవారి కల్యాణానికి విచ్చేసే భక్తులకు భక్తిశ్రద్ధలతో సేవలందించాలి :  టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

Vontimitta, 09 April 2022: TTD Additional EO Sri AV Dharma Reddy on Saturday called upon all Srivari Sevakulu hailing from Vontimitta and its surrounding places in YSR Kadapa district to render service to all devotees arriving for Sri Kodandarama Swamy temple on April 15 for the celestial Sri Sitaram Kalyanam fete.

 

Accompanied by TTD JEO Sri Veerabrahmam the Additional EO addressed a meeting of Srivari Sevakulu and said the Sitaram kalyanotsavam was a significant event among the festivities of Sri Ramanavami Brahmotsavam beginning on Sunday with Dwajarohanam.

 

He said TTD is organising the celestial fete as a state festival and made elaborate arrangements as devotees are being expected from all over state and country.

 

Srivari Sevakulu should coordinate and ensure distribution of Anna Prasadam and also the special Talambralu to everyone without fail and ready the packets of Talambralu with pearls, also patiently service drinking water and buttermilk to the umpteen number of devout.

 

Chief Engineer Sri Nageswara Rao, SVETA Director Smt Prashanti were present at the Srivari Sevakulu meeting that was presided over by TTD Public Relations Officer Dr. T Ravi.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రాములవారి కల్యాణానికి విచ్చేసే భక్తులకు భక్తిశ్రద్ధలతో సేవలందించాలి : టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 09: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం చెంత ఏప్రిల్ 15వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీవారి సేవకులు భక్తిశ్రద్ధలతో సేవలందించాలని టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి కోరారు. ఒంటిమిట్టలోని కల్యాణవేదిక వద్దగల పిఏసిలో శనివారం ఉదయం శ్రీవారి సేవకులతో సమావేశం నిర్వహించారు. జెఈఓ శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ఒంటిమిట్ట రామాలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయని, ఈ ఉత్సవాల్లో కల్యాణోత్సవం విశిష్టమైందన్నారు. రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి స్థానికులతో పాటు పలు ప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసే అవకాశముందని తెలిపారు. భక్తులను క్రమబద్ధీకరించడంతోపాటు కల్యాణం అనంతరం అందరూ స్వామి, అమ్మవారి దర్శనం చేసుకునేలా చూడాలన్నారు. ప్రసాదాలు, ముత్యంతో కూడిన తలంబ్రాలను భక్తులకు అందించాలని సూచించారు. భక్తులందరికీ తాగునీరు, మజ్జిగ అందించాలన్నారు. ముందుగా శ్రీవారి సేవకులు ముత్యంతో కూడిన తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేయాలన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు, శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.