ARRANGEMENTS IN FULL SWING FOR VAIKUNTHA EKADASI-TIRUMALA JEO_ వైకుంఠ ఏకాద‌శికి ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు

Tirumala, 4 December 2018: The arrangements for ensuing Vaikuntha Ekadasi are under way and priority is being given for the Darshanam for common devotees which will last for nearly 44 hours on December 18 and 19, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

The JEO along with CVSO Sri Gopinath Jetti and CE Sri Chandra Sekhar Reddy inspected the arrangements for over three hours on Tuesday. As a part of the inspection the officials visited and inspected the ongoing works inside the temple, in four mada streets, at Kalyana Vedika via Bata Gangamma temple, in Narayanagiri gardens.

Later speaking to media persons the JEO said

* Pilgrims are allowed to enter into the compartments of Vaikuntham 2 through MBC 26 gate from 10am onwards on December 17

* After the compartments of VQC 2 and then VQC 1 gets filled, the pilgrims will be allowed to enter into the sheds constructed in Narayanagiri Gardens

* After filling of all compartments of Vaikuntham and sheds in Narayanagiri Gardens, the pilgrims will be allowed to enter in to the special sheds arranged in four mada streets galleries through N 1 gate and the arrangements were made to nearly forty thousand pilgrims here.

* Even these galleries also gets filled then the devotees were made to wait in Kalyana Vedika which has a holding capacity of 3000 pilgrims.

* Beyond this pint, the pilgrims will be made to wait in the queue lines laid at New Seva Sadan building.

* Continuous announcements through Radio and Broadcasting will be given for the information of pilgrims about these entry points in different languages

* Sarva Darshanam commences on December 18 by 5.30am and lasts up to midnight of December 19 with a break of less than an hour for Naivedyam.

* Arrangements of continuous supply of food and water with Srivari Seva volunteers has been planned at micro level

* Set to provide Vaikuntha Dwara darshanam to 1.70pilgrims during these two days

Later the JEO also inspected new Seva Sadan buildings which are set for opening.

SE 2 Sri Rmachandra Reddy, SE Electrical Sri Venkateswarulu, ACVSO Sri Sivakumar Reddy, HO Dr Sermista, Annaprasadam SO Sri Venugopal, VGOs Smt Sada Lakshmi, Sri Manohar were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైకుంఠ ఏకాద‌శికి ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు

తిరుమ‌ల‌, 2018 డిసెంబ‌రు 04: డిసెంబ‌రు 18న వైకుంఠ ఏకాద‌శి, 19న ద్వాద‌శి సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గకుండా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు తెలిపారు. తిరుమ‌ల‌లోని ఆల‌య మాడ వీధులు, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌ను మంగ‌ళ‌వారం టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టితో క‌లిసి జెఈవో త‌నిఖీ చేశారు.

ఈ సంద‌ర్భంగా జెఈఓ మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ సూచ‌న‌ల మేర‌కు మాడ వీధుల్లో దాదాపు 40 వేల మంది భ‌క్తులు కూర్చునేందుకు వీలుగా చ‌లికి ఇబ్బందులు లేకుండా షెడ్లు ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఇక్క‌డ తాగునీరు, అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తామ‌ని, మ‌రుగుదొడ్ల వ‌స‌తి క‌ల్పిస్తామ‌ని తెలిపారు. భ‌క్తుల‌ను ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌- 2, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌- 1లోకి అనుమ‌తిస్తామ‌ని, అవి నిండిన త‌రువాత వ‌రుస‌గా నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లు, ఆళ్వార్‌ట్యాంక్ లైన్‌, మాడ వీధుల్లోని షెడ్లు, బాట‌గంగ‌మ్మ గుడి మీదుగా క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద భ‌క్తులు వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు వివ‌రించారు. ఈ విధంగా మొత్తం 80 వేల మంది భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించే అవ‌కాశం ఉంద‌న్నారు. ఏకాద‌శి, ద్వాద‌శి రెండు రోజుల్లో ఒక ల‌క్షా 70 వేల మంది భ‌క్తులు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఒక‌రోజు ముందుగా భ‌క్తులు రావ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, చ‌లికాలం కావ‌డం, వ‌ర్షం ప‌డే సూచ‌న‌లు ఉండ‌డంతో ఎక్కువ స‌మ‌యం వేచి ఉండ‌కుండా భ‌క్తులు త‌మ తిరుమ‌ల యాత్ర ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని కోరారు. డిసెంబ‌రు 18న ఉద‌యం 5.30 గంట‌ల నుండి సామాన్య భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌న్నారు.

జెఈవో వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇ-2 శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ర్టిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఆరోగ్య‌శాఖాధికారి డా.. శ‌ర్మిష్ట‌, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ త‌దిత‌రులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.