DONATION OF PATTU VASTRAMS_ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వస్త్రబహుమానం స్వీకరణ

Tiruchanoor, 4 December 2018: It is an age old practice to accept contributions of silks from devotees and adorn them to the presiding deity of Goddess Padmavati during the Karthika Brahmotsavams.

A special counter has been set up at Vahana mandapam to receive the silk donations from devotees on Tuesday afternoon.

This counter will operate between 1pm and 7pm. Only silk sarees with nine inch border zari are accepted for adorning it to the mula murthy.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వస్త్రబహుమానం స్వీకరణ

తిరుప‌తి, 2018 డిసెంబ‌రు 04: సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని డిసెంబరు 4 నుండి 12వ తేదీ వ‌ర‌కు భక్తుల నుంచి ప‌ట్టువస్త్రాల‌ను బహుమానంగా స్వీకరిస్తారు. భ‌క్తులు స‌మ‌ర్పించే ఈ వ‌స్త్రాల‌ను అమ్మవారి మూలమూర్తికి అలంకరిస్తారు.

ఇందుకోసం వాహన మండపం వద్ద ప్రత్యేకంగా కౌంటర్‌ ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 1.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు భ‌క్తుల నుండి వస్త్రాలను స్వీకరిస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తికి అలంకరించేందుకు 9 ఇంచులు, ఆపైన గల జరీ బార్డర్‌ కలిగిన నాణ్యమైన పట్టుచీరలను మాత్రమే స్వీకరిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.