AP GOVT OFFERS SILKS TO GODDESS PADMAVATHI_ శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ

Tiruchanoor, 4 December 2018: On behalf of State Government, as a part of the traditional practice of making offerings during annual Brahmotsavams the state industry minister Sri N Amarnath Reddy presented silk vastrams to Goddess Padmavati on Tuesday.

The Tirupati JEO Sri P Bhaskar, received the silks on behalf of the TTD and later presented prasadams to the dignitaries after darshanam of goddess.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ

తిరుప‌తి, 2018 డిసెంబ‌రు 04: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ మంత్రి గౌ|| శ్రీ ఎన్‌.అమరనాథరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.

అనంతరం గౌ|| మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండోసారి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల కోసం టిటిడి అన్ని వ‌స‌తులు క‌ల్పించింద‌న్నారు. భ‌క్తుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ఇటీవ‌ల నూత‌న అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం నిర్మించ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. తిరుప‌తిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాల‌న్న‌ గౌ|| ముఖ్య‌మంత్రి ఆలోచ‌న మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌న్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో క‌లెక్ట‌ర్ శ్రీ పిఎస్‌.ప్ర‌ద్యుమ్న‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.