ARRANGEMENTS IN PLACE FOR MAHASIVARATHRI-JEO TPT_ శ్రీకపిలేశ్వరాలయంలో మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
Tirupati, 4 Mar. 19: All the arrangements have been made for the auspicious occasion of Mahasivarathri on Monday in the temple of Kapileswara Swamy, said TTD JEO for Tirupati, Sri B Lakshmikantham.
Speaking to media in the temple premises after inspecting the arrangements made for the big day in Sri Kapileswara Swamy Temple (Sri KT), the JEO said, Sri Somaskandamurthy will take a celestial ride on Nandi Vahanam on Monday evening.
“Abhishekam and special rituals were performed to the Lord today morning and devotees were ensured hassle free darshan. In view of the anticipated heavy rush, elaborate security arrangements were made in the temple”, he added.
Temple DyEO Sri Subramanyam, VGO Sri Ashok Kumar Goud, AEO Sri Nagaraj, Suptd Sri Rajkumar, Archakas and devotees took part.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీకపిలేశ్వరాలయంలో మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
తిరుపతి, 2019 మార్చి 04: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ కపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేషంగా విచ్చేసిన భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేపట్టామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఆలయంలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సాయంత్రం విశేషమైన నంది వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి భక్తులను అనుగ్రహిస్తారని తెలిపారు. ఈ రోజు ఉదయం రుద్రాభిషేకం, ఇతర ప్రత్యేక కైంకర్యాలు జరిగాయని, తోపులాటలు లేకుండా భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకున్నారని వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు.
ఆ తరువాత తిరుపతిలోని అరవింద నేత్ర వైద్యశాలలో జరుగుతున్న ఏర్పాట్లను జెఈవో పరిశీలించారు.
విశేషంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు
మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6 నుండి 7 గంటల వరకు ఎస్.వి.సంగీత కళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు శివరాత్రి పురాణ ప్రవచనం, మధ్యాహ్నం 11.30 నుంచి 1 గంట వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులతో శివోహం భజన కార్యక్రమం, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు శివానందలహరి భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
అదేవిధంగా సాయంత్రం 6.30 నుంచి 9.30 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన శ్రీ వినాయక నాట్య మండలి(సురభి కళాకారులు) పౌరాణిక నాటకం, రాత్రి 9.30 నుంచి 11.30 గంటల వరకు ఎం.రాముడు భాగవతార్చే హరికథ, రాత్రి 11.30 నుంచి మంగళవారం తెల్లవారుజామున 1 గంట వరకు శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ, తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి రుద్రం పారాయణం చేస్తారు. తెల్లవారుజామున 1 గంట నుంచి 2.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ బి.రఘునాథ్ బృందంతో శివ సంకీర్తనలు, ఉదయం 2.30 నుంచి 4.30 గంటల వరకు శ్రీమతి జి.మునిలక్ష్మి బృందం హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.