TIRUMALA JEO OFFERS SILK CLOTHES IN VEMULAVADA_ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పణ

Tirumala, 4 Mar. 19: On the occasion of Mahasivarathri, Tirumala JEO Sri KS Sreenivasa Raju offered silk vastrams to the renowned temple of Lord Siva, Sri Raja Rajeswara Swamy in Vemulawada in Siricilla district of Telangana.

OSD P Seshadri and Bokkasam Incharge Sri Gururaja of TTD were also present

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పణ

మార్చి 04, తిరుమల 2019: తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామికి టిటిడి తిరుమల జెఈఓ శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు సోమ‌వారం పట్టువస్త్రాలు సమర్పించారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జెఈఓ శ్రీ కెఎస్.శ్రీనివాసరాజుకు ఆలయాధికారులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఆలయ ఈఓ శ్రీ రాజేశ్వర్ పట్టువస్త్రాలు స్వీకరించి స్వామివారికి సమర్పించారు. అనంతరం జెఈఓకు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడి రాజరాజేశ్వరస్వామివారికి ప్రతి ఏటా టిటిడి తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులందరిపై స్వామివారి ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.