NANDIVAHANAM GLIDES ON THE STREETS_ నంది వాహనం

TEMPLE CITY REVERBERATES TO THE CHANT OF HARA HARA MAHADEVA SAMBHO SANKARA

Tirupati, 4 Mar. 19: The temple city of Tirupati on Monday echoed to the holy chants of Hara Hara Mahadeva Sambho Sankara on the auspicious occasion of Maha Siva Rathri.

All roads lead to the famous shrine of Sri Kapileswara Swamy temple in Tirupati. The day was hectic with abhishekams, special pujas, rituals taking place in the temple since wee hours.

TTD has made elaborate arrangements of security in view of heavy influx of devotees.

NANDIVAHANAM GLIDES ON THE STREETS

In the evening the processional deity took celestial ride on Nandi Vahanam which commenced at 6pm and lasted for over four hours.

The devotees made a beeline all through the procession way in streets. Haratis were rendered by devotees at each point to Vahanam.

In the wee hours of Tuesday, Lingodbhavam will be observed at 5am with Lingodbhavakala Abhishekams.

SIVAPARVATI KALYANAM ON MARCH 5

Meanwhile the celestial wedding ceremony Sri Siva Parvathi Kalyanam will be observed on March 5 between 5pm and 7pm.

Temple DyEO Sri Subramanyam, VGO Sri Ashok Kumar Goud, AEO Sri Nagaraj, Suptd Sri Rajkumar, Archakas and devotees took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

నంది వాహనం :

తిరుపతి, 2019 మార్చి 04: సాయంత్రం 6.00 నుండి రాత్రి 10.00 గంటల వరకు నంది వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుపతి పురవీధుల్లో ఈ వాహనసేవ నిర్వహిస్తారు. శ్రీకపిలేశ్వరస్వామివారికి నంది వాహనం ఎంతో విశేషమైనది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వాహనసేవకు హాజరవుతారు. రాత్రి 12.00 నుండి మార్చి 5వ తేదీ ఉదయం 4.00 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహిస్తారు.

ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో తితిదే ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించేందుకు, వెలుపలికి వచ్చేందుకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు, నగరవాసులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ద్విచక్రవాహనాలకు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నప్రసాదాల పంపిణీ, క్యూలైన్ల క్రమబద్ధీకరణ కోసం శ్రీవారి సేవకులను వినియోగించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఇవో శ్రీ నాగ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, అర్చకులు శ్రీ స్వామినాథ స్వామి, శ్రీ విజయస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.