ARRANGEMENTS IN PLACE TO DISPATCH AMMAVARI PRASADAMS THROUGH INDIA POSTS- JEO TPT _ మొద‌టిసారి వ‌ర్చువ‌ల్ సేవ‌గా వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం – టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tiruchanoor, 24 Jul. 20: All arrangements are in place and dispatch of Ammavari Prasadams to the online registered devotees commenced from today onwards through India Posts, said TTD JEO Sri P Basant Kumar.

Speaking at Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor on Friday evening after handing over the Ammavari prasadams to be dispatched to the Postal Department officials, he said, the first ever-virtual participation of Varalakshmi Vratam is mulled by TTD on July 31 upon the request of a majority of devotees.

 

“Our online tickets booking commenced on July 22 and will continue till July 30. We received an overwhelming response from devotees in the last two days itself. All the Gotra Namas of devotees booked so far were enlisted and kept at Sanctum Sanctorum for the benign blessings of Universal Mother as directed by Archaka Swamy’s. The prasadams including vermilion-turmeric sachets, a dozen bangles along with a Uttariyam and a Blouse piece will be dispatched to the devotees who booked in on-line through India Posts. The dispatch process has already commenced today”, he added.

Adding further he said, the Varalakshmi Vratam will be telecasted live on Sri Venkateswara Bhakti Channel on July 31 between 10am and 12noon and the devotees shall beget the blessings of Sri Padmavathi Ammavaru through virtual participation”.

Temple DyEO Smt Jhansi Rani, Postal Department Superintendent Sri Srinivasa Rao, AEO Sri Subramanyam and others were also present.

BANGLES DONATED

A local devotee Sri Shanmugam has donated 1000 dozens of bangles to Ammavaru to be distributed among devotees. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మొద‌టిసారి వ‌ర్చువ‌ల్ సేవ‌గా వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం – టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌
       
తిరుప‌తి, 2020 జూలై 24: సిరుల త‌ల్లి తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో జూలై 31వ తేదీ శుక్ర‌వారం వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని వ‌ర్చువ‌ల్ సేవ‌గా ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ తెలిపారు. తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో  వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం టికెట్లు పొందిన భ‌క్తులకు అందించే ప్ర‌సాదాల‌కు శుక్ర‌వారం పూజ‌లు నిర్వ‌హించి ఇండియా పోస్ట‌ల్ వారికి అందించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ భ‌క్తుల కోరిక మేర‌కు వ‌ర్చువ‌ల్ సేవ‌గా జూలై 22వ తేదీ సాయంత్రం నుండి ఆన్‌లైన్‌లో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్ల‌కు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా అమ్మ‌వారి ఆల‌యంలో శ్రావ‌ణ‌మాసం మొద‌టి శుక్ర‌వారం సంద‌ర్భంగా అమ్మ‌వారి మూల‌విరాట్టు పాద‌ప‌ద్మా‌ముల వ‌ద్ద ఉత్త‌రియం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, గాజులు, అక్షిత‌లు, కంక‌ణాలు ఉంచి ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించార‌న్నారు. వీటిని జూలై 31వ తేదీలోపు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్లు పొందిన గృహ‌స్తుల చిరునామాకు చేర‌వేసేందుకు ఇండియా పోస్టల్‌వారికి అందించిన్న‌ట్లు ఆయ‌న తెలియ‌జేశారు.

వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ప‌ర్వ‌దినం రోజున టికెట్లు పొందిన గృహ‌స్తుల గోత్ర నామాలు అర్చ‌క స్వాములు అమ్మ‌వారి మూల విరాట్టు పాదాల వ‌ద్ద ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. జూలై 31వ తేదీ ఉద‌యం 10.00 నుండి మ‌ధ్యాహ్న‌నం 12.00 గంటల వ‌ర‌కు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్నిఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు జెఈవో తెలిపారు.  వ్ర‌తంలో పాల్గొనే భ‌క్తులు అర్చ‌క స్వాముల సూచ‌న‌ల మేర‌కు త‌మ గోత్ర ‌నామాలు ప‌ఠించాల్సి ఉంటుంద‌న్నారు.  

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, తిరుప‌తి డివిజ‌న్ పోస్ట‌ల్ సూప‌రిండెంట్ శ్రీ ఎ.శ్రీ‌నివాస‌రావు, అసిస్టెంట్  ‌సూప‌రిండెంట్ శ్రీ కె.వి.గ‌ణ‌ప‌తి పాల్గొన్నారు.

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి వెయ్యి డ‌జ‌న్ల గాజులు విరాళం

ప‌విత్ర శ్రావ‌ణ మాసం సంద‌ర్భంగా తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి వెయ్యి డ‌జ‌న్ల గాజుల‌ను తిరుచానూరుకు చెందిన శ్రీ ష‌ణ్ముగం శుక్ర‌వారం టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌కు‌ అందించారు.

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులకు ప్ర‌సాదంగా ఈ గాజులు అందించాల‌ని ఆల‌య అధికారుల‌ను దాత‌ కోరారు.  

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.