ANDAL TIRUVADIPPODI UTSAVAM OBSERVED AT TIRUMALA _ తిరుమ‌ల‌లో శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర

Tirumala, 24 Jul. 20: The Tiruvadippodi Utsavam of Andal Sri Goda Devi was observed at Tirumala on Friday.

As a part of this, Sesha Vastram and Shatari were offered in Purusaivari Tota followed by the religious discourse of Sri Chinna Jiyar Swamy of Tirumala.

According to legend, Andal Sri Goda Devi emerged in Tulasi garden while Sri Anantalwan developed the gardens in Tirumala and commenced Pushpa Kainkaryam to the lord.

Every year, Andal Tiruvadippodi Utsavam is being observed in Purusaivari Tota since several centuries.

Andal who is believed to be the incarnation of Bhudevi was found to the great Sri Vaishnavaite devotee Sri Vishnuchitta in Tulasi garden on the auspicious day of Purva Phalguni Nakshatra in Ashada Sukla Chaturdi,

In Kataka month on the advent of the same auspicious star and tithi, Andal Tiruvadippodi Utsavam is being observed in Tirumala every year.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర
        
తిరుమల, 2020 జూలై 24: తిరుమలలో శుక్రవారం శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర  జరిగింది. 
         
ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీవారి శేషవస్త్ర‌న్ని, శఠారిని పురుశైవారితోటలోని శ్రీ అనంత ఆళ్వార్ కి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారు ప్రబంధ పారాయణం నిర్వహించారు. 
 
శ్రీ ఆండాళ్ అమ్మ‌వారు తుల‌సీ వ‌నంలో జ‌న్మించారు, స‌ప్త‌గిరుల‌ను శ్రీ అనంత ఆళ్వార్ నంద‌న‌వ‌నంగా మార్చారు. కావున తిరుమ‌ల‌లో ప్ర‌తి ఏడాది తిరువ‌డిపురం ఉత్స‌వంను పురుశైవారితోటలో నిర్వ‌హించ‌డం అన‌వాయితిగా వ‌స్తుంద‌ని అర్చ‌కులు తెలిపారు. ‌
 
పురాణాల ప్రకారం పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థి నాడు పూర్వఫల్లునీ నక్షత్రంలో భూదేవి అంశగా ఆండాళ్‌(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ కారణంగా కటక మాసం పూర్వఫల్గుని నక్షత్రంలో ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర నిర్వహిస్తారు. 
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.