ARTISTIC PERFORMANCES _ ముత్యపు పందిరి వాహన సేవలో కళాబృందాల ప్రదర్శన

TIRUPATI, 30 NOVEMBER 2024: A dozen teams consisting 272 artistes hailing from various states have performed different artforms in front of Mutyapu Pandiri Vahana Seva on Saturday.
 
The third day of ongoing annual brahmotsavams at Tiruchanoor witnessed a range of dance forms including Kathak, Bharatnatyam, Kuchipudi, besides the folk dances like Kanjeera Kolatam and Pillanagrovi.
 
Braving the continuous showers, the artists and students of the TTD run SV College of Music and Dance portrayed mythological characters and allured the devotees with their performances.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముత్యపు పందిరి వాహన సేవలో కళాబృందాల ప్రదర్శన
 
తిరుపతి, 2024 నవంబరు 30:  పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజైనా శనివారం ఉదయం ముత్యపు పందిరి వాహన సేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన 12 కళా బృందాలలోని 272 మంది కళాకారులు అమ్మవారికి కళా నిరాజనం సమర్పించారు.
 
ఇందులో భాగంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన కళాకారులు కథక్, భరతనాట్యం, కూచిపూడి, కంజీర కోలాటం మరియు పిల్లనగ్రోవి వంటి జానపద నృత్యాలతో సహా అనేక రకాల నృత్య రూపాలను ప్రదర్శించారు.
 
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జల్లుల మధ్య తిరుపతి ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన  విద్యార్థులు పౌరాణిక పాత్రలను పోషించి భక్తులను అలరించారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.