KUMBHA MELA IN UP FROM JAN 13 TO FEB 26 IN 2025 _ జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళా

TTD TO SET UP  REPLIKA TEMPLE AT KUMBHAMELA  

JEO(H&E) INSPECTS ALLOTTED SITE

TIRUMALA, 30 NOVEMBER 2024: As the prestigious Kumbh Mela event is all set to be held at Prayagraj (Allahabad) from January 13, 2025 to February 26, 2025, in UP, TTD as a part of promoting Hindu Sanatana Dharma across the country sought the Kumbh Mela authority for an appropriate place to set up a model temple of Sri Venkateswara Swamy for the sake of nationwide devotees.

In connection with this, TTD JEO for Health and Education Smt Gowthami IAS   has formally met the Kumbha Mela Authority Officer 

Sri Vijay Kiran Anand IAS at Prayagraj in UP on Saturday. 

The Kumbh Mela Authorities have allotted a piece of land to the extent of 2.5acre in the Sixth Sector for TTD to set up the replica temple of Sri Venkateswara Swamy.

Later the JEO also inspected the land allotted to TTD by the Kumbh Mela authorities along with the recce team of TTD officials and made some valuable suggestions to the team of officers on the arrangements to be made for the mega religious event keeping in view especially the North Indian devotees who throng event. 

The recce team included HDPP secretary Sri Sriram Raghunath, SE 1 Jagadeeshwar Reddy, EE Sri Surendranath Reddy, and others took part.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళా

కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయనున్న టీటీడీ

స్థలాన్ని పరిశీలించిన టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి

తిరుమల, 2024 నవంబరు 30: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా హిందు ధర్మ ప్రచారం కోసం టీటీడీ భాగం కానుంది.

ఈ సందర్భంగా ప్రయాగ రాజ్ లో టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ జేఈఓ (ఆరోగ్యం, విద్య) శ్రీమతి గౌతమి ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళా అధికారి శ్రీ విజయ్ కిరణ్ ఆనంద్(ఐఏఎస్)ను లాంఛనంగా కలిశారు.

ప్రయాగ రాజ్ లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు కుంభమేళా అధికారులు టీటీడీకి ఆరో సెక్టార్ లో 2.50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.

ఈ సందర్భంగా జేఈవో ఆ స్థలాన్ని టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కుంభమేళాకు తరలివచ్చే ఉత్తరాది భక్తులను దృష్టిలో ఉంచుకుని నమూనా ఆలయం వద్ద ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

స్థలాన్ని పరిశీలించిన టీటీడీ బృందంలో హెచ్ డీపీపీ సెక్రటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ శ్రీ సురేంద్రనాథ్ రెడ్డి, ఇతర స్థానిక అధికారులు ఉన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.