ASTHANAM HELD IN LOCAL TEMPLES _ టీటీడీ స్థానికాల‌యాల్లో ఘనంగా దీపావళి ఆస్థానం

Tirupati, 31 October 2024: In connection with Deepavali on Thursday, the traditional Asthanam was observed in all the local temples of TTD.

Among them, the Deepavali Asthanam was observed at Sri Govindaraja Swamy temple and Sri Kodandarama Swamy temple in Tirupati.

At Sri Govindaraja Swamy temple festival of lights were lit at all the sub shrines of Sri Pundarikavalli Tayar, Parthasaradhi, Andal Ammavaru, Sri Kalyana Venkateswara Swamy Sannidhis after performing Asthanam.

While at Sri Kodanda Ramalayam new robes, Dosa Padi and ghee filled mud lamps  brought from Sri Govindaraja Swamy temple and offered to Sri Kodanda Rama.

TTD has cancelled Hanumanta Vahana Seva in Sri Kodanda Rama Swamy temple which is usually observed on the day of Amavasya, following Deepavali Asthanam.

Deputy EOs and other officials of the respective temples and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ స్థానికాల‌యాల్లో ఘనంగా దీపావళి ఆస్థానం

తిరుపతి, 2024 అక్టోబ‌రు 31: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యాల్లో గురువారం దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వ‌హించారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో….

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి బాలాలయంలోని స్వామివారికి సమర్పించారు. అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహించారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో….

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా గురువారం రాత్రి దీపావ‌ళి ఆస్థానం ఘ‌నంగా నిర్వహించారు.

దీపావళి సందర్భంగా గురువారం రాత్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆల‌య‌ డెప్యూటీ ఈవోలు శ్రీమ‌తి శాంతి, శ్రీమతి నాగరత్న, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.