ASWA MARKS THE END OF VAHANA SEVAS _ అశ్వవాహనంపై క‌ల్కి అవ‌తారంలో క‌ల్యాణ శ్రీ‌నివాసుడు 

TIRUPATI, 18 FEBRUARY 2023: The vahana sevas as part of ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram concluded with  Aswa Vahana Seva on Saturday evening.

 

In the guise of Kalki, Sr Kalyana Venkateswara blessed His devotees on Horse carrier.

 

Special Gr DyEO Smt Varalakshmi, Kankanabhattar Sri Balaji Rangacharyulu, AEO Sri Gurumurty, Superintendents Sri Chengalrayalu, Sri Venkata Swamy, temple Inspector Sri Kiran Kumar Reddy were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అశ్వవాహనంపై క‌ల్కి అవ‌తారంలో క‌ల్యాణ శ్రీ‌నివాసుడు

తిరుప‌తి, 2023 ఫిబ్ర‌వ‌రి 18: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు శనివారం రాత్రి 7 నుండి 8 గంటల నడుమ శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామిక‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియనియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, తన సంకీర్తనలు చేసి తరించాలని ప్రబోధిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గురుమూర్తి, కంకణ బట్టర్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.