KAPILESWARA BLESSES DEVOTEES ON NANDI VAHANA_నంది వాహనంపై కైలాసనాథుడు 

TIRUPATI, 18 FEBRUARY 2023: On the auspicious occasion of Mahashivratri on Saturday evening, Kamakshi sameta Sri Kapileswara Swamy took out a celestial ride on Nandi Vahanam along the streets to bless the devotees.

All roads led to Kapilathirtham to have darshan of the presiding deity as Nandi Vahana.

TTD has made elaborate arrangements of queue lines, barricades, Annaprasadam and water distribution on the occasion and made traffic regulations with the help of local police esuring devotees hassle free darshan.

Deputy EO Sri Devendra Babu, AEO Sri Parthasaradi, Superintendent Sri Bhupati and other temple staffs were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

నంది వాహనంపై కైలాసనాథుడు

తిరుపతి, 18 ఫిబ్రవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి  వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం రోజైన శనివారం రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో సాయంత్రం 6 గంటల నుండి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. మ‌హావిష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది.

లింగోద్భవకాల అభిషేకం…

ఫిబ్ర‌వ‌రి 19వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.