ASWATHA PUJA AND SARVABHOUNA VRATAM PERFORMED _ వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా అశ్వ‌త్థ(రూప విష్ణు)పూజ‌, సార్వ‌భౌమ వ్ర‌తం

Tirumala, 24 Nov. 20As part of month long Karthika Deeksha programs mulled by TTD at Tirumala, Aswatha (sacred fig tree) Puja and Sarvabhouma Vratam were held in Vasanta Mandapam on Tuesday between 8:30 and 9:30am.

According to Agama Advisor Sri Mohanarangacharyulu, Aswatha tree is revered as Narayana Swaroopa. 

Circumambulation to Aswatha tree for nine times will yield children to childless parents and the vratam will provide health, he added.

The utsava deities of Sri Malayappa accompanied by Sridevi and Bhudevi were brought to the Vasanta Mandapam.

The replicas of Lakshmi Narayana were also kept and special pujas were performed. 

Additional EO Sri AV Dharma Reddy, Chief Priest Sri Venugopala Deekshitulu, Agama Advisor Sri Sundaravaradan were also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా అశ్వ‌త్థ(రూప విష్ణు)పూజ‌, సార్వ‌భౌమ వ్ర‌తం

తిరుమల‌, 2020 నవంబరు 24: కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా మంగ‌ళ‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో అశ్వ‌త్థ(రూప విష్ణు)పూజ‌, సార్వ‌భౌమ వ్ర‌తం శాస్త్రోక్తంగా జ‌రిగాయి. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఇందుకోసం ల‌క్ష్మీనారాయ‌ణుల ప్ర‌తిమ‌ల‌ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ అశ్వ‌త్థ వృక్షం(రావి చెట్టు) సాక్షాత్తు శ్రీ‌మ‌న్నారాయ‌ణ స్వ‌రూప‌మ‌ని అన్నారు. సంతానం లేనివారు 9 పోగుల తెల్ల‌దారాన్ని ఈ వృక్షానికి చుట్టి సాష్టాంగ ప్ర‌ణామం చేస్తే 9 మాసాల్లో సంతానం క‌లుగుతుంద‌ని విశ్వాస‌మ‌న్నారు. అశ్వ‌త్థ వృక్షం కింద రామాయ‌ణం, భ‌గ‌వ‌ద్గీత లాంటి గ్రంథాల పారాయ‌ణం చేస్తే నాలుగు వేదాల పారాయ‌ణ ఫ‌లితం ల‌భిస్తుంద‌న్నారు. శ్రీ‌మ‌న్నారాయ‌ణుడికి, అశ్వ‌త్థ వృక్షానికి చ‌తుర్వేద మంత్రాల‌తో ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాలు, సార్వ‌భౌమ వ్ర‌తం నిర్వ‌హించామ‌ని, తద్వారా వ్యాధి బాధ‌లు తొల‌గుతాయ‌ని తెలిపారు.

ముందుగా కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, విష్ణుపూజా మంత్ర ప‌ఠ‌నం చేశారు. ఆ త‌రువాత స్వామి, అమ్మ‌వార్ల‌కు తిరువారాధ‌న చేశారు. అనంతరం అశ్వ‌త్థ వృక్షానికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ద‌నాచార్యులు, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.