TTD EO LAUDS PM TROPHY WINNER SV COLLEGE STUDENT _ ప్రధాని ట్రోఫీ విజేతకు టీటీడీ ఈవో అభినందన

Tirupati, 11 Feb. 21: TTD Executive Officer Dr KS Jawahar Reddy on Thursday congratulated a student of TTD run SV Arts College, Hari Prasad for winning the PM trophy for AP by participating in the Republic Day parade at New Delhi.

Hailing from Sullurpeta of Sri Potti Sreeramulu Nellore district Hariprasad is studying BA course at SV Arts College and had participated in the R Day parade as part of the Airwing of NCC.

He had bagged the PM trophy for best performance at the Parade and achieved the decoration for AP after 15 years.

Hari Prasad has been awarded a Rs Two lakhs cash purse by the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy for getting honours to AP when he called on him recently.

He apprised TTD EO of the selection process of the Republic Day parade. Hari Prasad expressed his goal to serve people by joining civil services.

Devasthanams Education Officer Sri Govindarajan, boy’s parents, NCC caretaking officer Dr P Mohan, SV arts college Principal Dr T Narayanamma were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రధాని ట్రోఫీ విజేతకు టీటీడీ ఈవో అభినందన

తిరుపతి 11 ఫిబ్రవరి 2021: రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన పరేడ్ లో పాల్గొని ప్రధాని ట్రోఫీ గెలుచుకున్న శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థి ఎ. హరిప్రసాద్ ను టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అభినందించారు.

గురువారం సాయంత్రం టీటీడీ పరిపాలన భవనంలో హరిప్రసాద్ ఈవోను కలిశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట హరిప్రసాద్ స్వగ్రామం. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న హరి ప్రసాద్ రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఎన్ సిసి తరపున ఎయిర్ వింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కేరే ఎంపికయ్యారు. పరేడ్ లో విశేష ప్రతిభ కనబరచి 15 ఏళ్ళ తరువాత ఆంద్రప్రదేశ్ కు ప్రధాని ట్రోఫీని సాధించారు.

హరిప్రసాద్ ఇటీవల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సి ఎం అతన్ని అభినందించి రాష్ట్రం తరపున ట్రోఫీ తో పాటు రూ 2 లక్షల ప్రోత్సాహక నగదు బహుమతి అందించారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఈవోను కలిశారు. ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి
రిపబ్లిక్ డే పరేడ్ ఎంపిక విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. టీటీడీ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థి పి ఎం ట్రోఫీ గెలవడం అభినందనీయమన్నారు. తాను సివిల్ సర్వీసెస్ కు ఎంపికై ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నట్లు హరిప్రసాద్ ఈవోకు తెలిపారు.

టీటీడీ విద్యా విభాగం డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, హరిప్రసాద్ తల్లిదండ్రులు శ్రీ. ఎ. శ్రీనివాసులు, శ్రీమతి ఎ. కమల, ఎన్ సిసి కేర్ టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ పి.మోహన్, ఎస్వీ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ టి.నారాయణమ్మ, డాక్టర్ ఎల్ ఆర్ మెహన్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది