AVIRBHAVOTSAVAM OF SRI BHOGA SRINIVASA HELD AT TIRUMALA _ స‌హ‌స్రా శీర్ష పురుషునికి ప్ర‌త్యేక స‌హ‌స్ర‌క‌ల‌శాభిషేకం –

Tirumala, 05 June 2022: As part of Sri Bhoga Srinivasa Avirbhavotsavam vishesha Sahasra Kalashabisekam was performed at Bangaru Vakili in Srivari temple on Sunday.

Legends say that the unique 18 inches silver idol was presented to the temple by Pallava queen Samavai Perundevi in 614 AD on this day. As part of celebrations the utsava idols of Sri Malayappa Swamy and His consorts, Sri Bhoga Srinivasmurty and Sri Viswaksena are brought to Bangaru Vakili.

Thereafter amidst chanting of Vedic parayanams, the Archakas grandly performed Visesha Sahasra Kalashabhisekam. All the scheduled arjita sevas were also continued normally.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Sri AV Dharma Reddy, CVSO Sri Narasimha Kishore, DyEO Sri Ramesh Babu, Potu Peishkar Sri Parthasarathy, VGO Sri Bali Reddy Parupattedar Sri Tulasi Prasad and other temple officials and Archakas were present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

స‌హ‌స్రా శీర్ష పురుషునికి ప్ర‌త్యేక స‌హ‌స్ర‌క‌ల‌శాభిషేకం –

తిరుమలలో ఘనంగా శ్రీ భోగశ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం

తిరుమల, 2022 జూన్ 05: శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన దినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని టీటీడీ ఆదివారం నాడు వైభవంగా నిర్వహించింది.

ఇందులో బాగంగా ఉదయం 6.00 నుంచి 8.00 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేశారు.

శ్రీ‌వారి మూల‌మూర్తికి ముందు గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో కౌతుకమూర్తి అయిన‌ శ్రీ మనవాళపెరుమాళ్ ను, అయ‌న‌కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఉంచారు. త‌ర్వాత‌ శ్రీ‌వారి మూల‌మూర్తిని శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి క‌లుపుతూ దారం క‌ట్టి అనుసంధానం చేశారు. అన‌గా శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి నిర్వ‌హించే అభిషేకాధి క్ర‌తువులు మూల‌మూర్తికి నిర్వ‌హించిన‌ట్లు అవుతుంది.

అనంత‌రం వేద పండితులు వేద పారాయ‌ణం చేయ‌గా, అర్చకస్వాములు ఏకాంతంగా ప్ర‌త్యేక సహస్రకలశాభిషేకం వైభ‌వంగా నిర్వహించారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెదజీయ్య‌ర్‌ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్ దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, పోటు పేష్కార్ శ్రీ పార్థ‌సార‌ధి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఫార్‌ప‌తేదార్ శ్రీ తుల‌సీ ప్ర‌సాద్‌, అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.