BAGH SAVARI HELD _ తిరుమలలో కన్నుల పండుగగా ”బ్యాక్ స‌వారి ”

TIRUMALA, 06 OCTOBER 2022: Fervour marked the Bagh Savari festival observed at Tirumala on Thursday evening. The festival which would be observed on the immediate day after the conclusion of the nine-day Brahmotsavam has a great religious significance attached to it.

According to the temple legends, Sri Venkateswara and His Consort in the guise of ordinary humans destroy the flower gardens grown up by Ananthalwar, a great devotee of the Lord only to testify his dedicated devotion.

In a bid to catch-hold of the divine “Human Couple”, Ananthalwar succeeds in tying up Goddess to an Aswatha tree in his garden while the Lord escapes from his clutches running anti-clockwise. Later, Ananthalwar realises his mistake and carries the Goddess in a floral basket to the Srivari temple and rejoins her with the Lord.

To mark the anti-clockwise running of the Lord, this festival is believed to be conducted in an anti-clockwise manner. In connection with the festival, the processional deities of Lord Malayappa Swamy and His consorts were taken around in a procession from the main temple to the Ananthalwar gardens situated on the southwest corner of the temple complex.

After observing certain religious formalities at the gardens, the deities were again taken back to the main temple.

Peishkar Sri Srihari, descendants of Sri Anantalwar and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో కన్నుల పండుగగా ”బ్యాక్ స‌వారి ”
 
తిరుమల, 2022 అక్టోబరు 06: శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన ”బాగ్ స‌వారి ” ఉత్సవం గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.
 
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”బాగ్ స‌వారి ” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి దేవేరి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలోకి ప్రవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడతాడు. వెంటనే అమ్మవారిని బంధీ నుండి విముక్తురాలిని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తుని భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షిణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు. 
 
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”బాగ్ స‌వారి ” ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ  కార్యక్రమం ఘనంగా ముగిసింది. 
 
ఈ కార్యక్రమంలో తిరుమల చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయ పేష్కర్ శ్రీ శ్రీహరి, పారుపత్తేదార్ శ్రీ తులసి ప్రసాద్ ఇతర ఆలయ అధికారులు, అనంతాళ్వారు వంశీకులు, భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.