BALALAYAM AT VONTIMITTA _ సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వ‌ర‌కు ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ”బాలాలయం”

Tirupati, 21 August 2022: The Balalayam in Sri Kodanda Ramalayam at Vontimitta will be observed from September 6 to 8.

Ankurarpanam for the fete will be performed on September 6 at 5:30am.

On September 7 and 8 vaidika programs will be observed in Yaga Sala.

As a part of Balalayam, a replica temple will set up with a photo of the presiding deity since Jeernodharana is being done in the Sanctum Sanctorum to the main deity.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వ‌ర‌కు ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ”బాలాలయం”

తిరుప‌తి, 2024 ఆగష్టు 21: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వ‌ర‌కు బాలాల‌యం జ‌రుగ‌నుంది. ఇందుకోసం సెప్టెంబర్ 6న సాయంత్రం 5.30 గంట‌లకు అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్ర‌ప‌ట్టాల‌ను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరుగువరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.

ఆలయంలోని యాగశాలలో సెప్టెంబర్ 7, 8వ తేదీలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 9.30 నుంచి 10. 30 గంటల మధ్య తులా లగ్నంలో బాలాలయ సంప్రోక్షణ నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.