ENSURING HEALTH SAFETY OF PILGRIMS IS OUR TOP MOST PRIORITY-TTD ADDNL.EO _ తిరుమలకు విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రత టిటిడి ప్రథమ కర్తవ్యం- టీటీడీ అదనపు ఈవో

FoSTaC TRAINING HELD TO HOTELIERS

Tirumala, 21 August 2024: Provide healthy and hygienic food to the pilgrims visiting Tirumala at affordable prices and ensuring their health safety is the top most priority of the TTD, said Additional EO Sri Ch Venkaiah Chowdary.

Addressing the training programme jointly organised by the Health Wing of TTD along with the Food Safety Department to the Hoteliers in Tirumala, under the instructions of TTD EO Sri J Syamala Rao, he said all the eateries should maintain the Standards as prescribed by the Food Safety authorities keeping in view the health safety of multitude of visiting pilgrims to Tirumala. The internal process of running a hotel as per standards should be scrupulously followed by streamlining the cleaning, storing, serving practices, he maintained.

Later the FSSAI certified trainer from New Delhi Sri Ch Anjaneyulu explained through Power Point Presentation on the Food Safety Management System that included the Hygienic and Sanitary practices to be followed in all the restaurants and eateries, Physical-Chemical-Biological Hazards of food spoilage, wastage disposal plan, display of License in front of their eateries, violation punishments in Food Safety Laws and Acts, other related subjects in an elaborated manner. He said the training to the hoteliers with Food Safety Training and Certification (FoSTaC) is a large scale training programme which is very much needed for providing healthy and tasty food to the devotees. 

TTD DyEO for Health Smt Asha Jyothi said, henceforth this training programme will be carried out to all the hoteliers once in every three months and hygiene measures would be assessed at regular intervals in all the eateries at Tirumala. 

Tirumala Health Officer Sri Madhusudhan Rao, Sri G Venkateswara Rao, Food Controller, Tirupati District, Sri Jagadeesh, Food Safety Officer, Tirumala, hoteliers of Tirumala, TTD Annaprasadam Canteen staff were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలకు విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రత టిటిడి ప్రథమ కర్తవ్యం

– హోటల్ యజమానులకు ఫాస్టాక్ (ఎఫ్ఓఎస్ టిఏసి) శిక్షణ

– టీటీడీ అదనపు ఈవో

తిరుమల, 2024 ఆగష్టు 21: తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంతోపాటు వారి ఆరోగ్య భద్రతే టిటిడి అత్యంత ప్రాధాన్యత అని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.

టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు ఆదేశాల మేరకు టిటిడి ఆరోగ్య విభాగం, ఆహార భద్రత విభాగాలతో కలిసి తిరుమలలోని హోటళ్ల నిర్వాహకులకు, యజమానులకు తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ సత్సంగం హాల్లో బుధవారం నాడు జరిగిన శిక్షణా కార్యక్రమంలో అదనపు ఈవో ప్రసంగిస్తూ, అన్ని రకాల తినుబండారాలు ఫుడ్ సేఫ్టీ నిర్దేశించిన ప్రమాణాలను పాటించాలని అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే వేలాది మంది భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం హోటళ్ళను నిర్వహించాలన్నారు. హోటళ్ల లోపల పరిశుభ్రత, ఆహార పదార్థాలు నిల్వ చేయడం, వడ్డించడం వంటి విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలించి క్రమబద్ధీకరించడం, తదితర విషయాలను నిశితంగా పరిశీలించాలని ఆయన హోటళ్ల వారికి చెప్పారు.

తరువాత న్యూ ఢిల్లీకి చెందిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫైడ్ ట్రైనర్ శ్రీ సిహెచ్ ఆంజనేయులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో అన్ని రెస్టారెంట్‌లు మరియు తినుబండారాలలో అనుసరించాల్సిన పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య పద్ధతులు, ఆహారం చెడిపోవడం వల్ల కలిగే భౌతిక-రసాయన-జీవ ప్రమాదాలు, వృధా వంటి వాటి గురించి వివరించారు, నిబంధనలను ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలు వంటి అనేక అంశాలను తెలియజేశారు.

టీటీడీ ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి మాట్లాడుతూ, ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి తిరుమలలో హోటళ్ల వ్యాపారులందరికీ ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూధన్ రావు, తిరుపతి జిల్లా ఫుడ్ కంట్రోలర్ శ్రీ జి. వెంకటేశ్వరరావు, తిరుమల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీ జగదీష్, తిరుమలలోని హోటళ్ల వ్యాపారులు, టిటిడి అన్నప్రసాదం సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.