BASHYAKARULA SATTUMORA HELD AT SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకారుల సాత్తుమొర

Tirumala, 05 May 2022: The annual Bashyakarula Sattumora fete was grandly celebrated at the Srivari temple on Thursday on the advent of Arudra Nakshatra in vaishaka month, the birth star of Sri Ramanujacharya.

As part of the celebrations, utsava idols of Sri Ramanujacharya was paraded along the Mada streets of Srivari temple and abhisekam was performed at Sri Bashyakarula Sannidhi on the footpath.

Later in the evening after the Sahasra Deepalankara Seva, Sri Malayappa Swamy along with His consorts will be paraded on a Tiruchi on the Mada streets and Pradakshina performed in the vimana prakaram of the temple.

Thereafter the Sattumora festivities will be conducted at the Sri Bashyakarula Sannidhi.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy and temple officials were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకారుల సాత్తుమొర

తిరుమ‌ల‌, 2022 మే 05: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడకదారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు.

సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంత‌రం ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణగా విచ్చేసి భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహించారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు జ‌రిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.