CHAIRMAN PERFORMS PUJA AND RESUMES SRIVARI METTU SERVICES _ శ్రీ‌వారి మెట్టు న‌డ‌క‌దారి పునఃప్రారంభం

TIRUMALA, 05 MAY 2022: TTD Chairman Sri YV Subba Reddy on Thursdayperformed pujas and resumed pilgrim services on the Srivari Mettu footpath route.

Speaking on the occasion the Chairman said, due to the unprecedented torrential downpour on November 16, 17 and 18 of 2021which had led to massive landslides on the Srivari Mettu footpath damaging steps, footpath, toilets etc.

The TTD Board Chief said Puranic legends say that Sri Venkateswara Swamy Himself has used this ancient route to reach Tirumala. The inscriptions of the Srivari temple also reveal that this footpath was developed by the kings of the Vijayanagara empire and that emperor Sri Krishna Devaraya had regularly used this path.

Complimenting the TTD Engineering department which took up the repair works on a war footing at a cost of ₹3.60 crore has completed all the works ahead of schedule for the benefit of the devotees, the Chairman said.

“Though it is a difficult task to bring the construction required for restoration works as the damaged occurred in the middle of the footpath, our Engineering officials did an excellent job in getting it ready ontime”, he added.

The Chairman felicitated all the Engineering officials, contractors on the occasion.

Board Members Dr C Bhaskar Reddy, Sri M Ramulu, Sri P Ashok Kumar, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, Additional CVSO Sri Siva Kumar Reddy, EE Sri Surendranath Reddy, VGO Sri Manohar were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ‌వారి మెట్టు న‌డ‌క‌దారి పునఃప్రారంభం

– రూ.3.60 కోట్ల‌తో మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు పూర్తి చేసి భ‌క్తుల‌కు అనుమ‌తి

– టీటీడీ చైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌, 2022 మే 05: శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గాన్ని గురువారం ఉద‌యం టీటీడీ చైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించి పునఃప్రారంభించి, ఈ మార్గంలో భ‌క్తుల‌ను తిరుమల కు అనుమ‌తించారు.

అనంత‌రం చైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ, గ‌త ఏడాది నవంబ‌రు 18, 19వ తేదీల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు శ్రీ‌వారి మెట్టు మార్గంలో పెద్ద బండ‌రాళ్ళు ప‌డి రోడ్డు, మెట్లు, ఫుట్‌పాత్‌లు, మ‌రుగుదొడ్లు దెబ్బ‌తిన్నాయ‌న్నారు. ఇంజినీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపాదిక‌న న‌డ‌క మార్గాన్ని రూ.3.60 కోట్ల‌తో మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు పూర్తి చేశార‌ని చెప్పారు. కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో శ్రీ‌వారి మెట్టు మార్గంలో మ‌ర‌మ్మ‌త్తులు పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది కాంట్రాక్ట‌ర్ల‌ను చైర్మ‌న్ అభినందించారు.

ఈ మార్గం గుండా ప్ర‌తి రోజు ఆరు వేల మంది, ప్ర‌త్యేక ప‌ర్వ‌దినాల్లో 15 వేల మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటార‌న్నారు. శ్రీ‌వారి మెట్టు మార్గంలోనే సాక్షాత్తు శ్రీ‌నివాసుడు తిరుమ‌ల‌కు చేరుకున్న‌ట్లు ,
శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న‌ట్లు శాస‌నాల ద్వారా తెలుస్తోంద‌ని వివ‌రించారు.

ఇంజినీరింగ్‌, కాంట్రాక్ట‌ర్ల‌కు స‌న్మానం :

అనంత‌రం శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గంలో త్వ‌రిత‌గ‌తిన మ‌ర‌మ్మ‌త్తులు పూర్తి చేసిన సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ – 2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఇఇ శ్రీ సురేంద్ర‌రెడ్డి, ఈరోడ్కు చెందిన ఆర్ఆర్ బిల్డ‌ర్స్ డిజిఎమ్ శ్రీ ఆర్ముగంను చైర్మ‌న్ శాలువ‌, శ్రీ‌వారి ప్ర‌సాదాల‌తో స‌న్మానించారు.

ఈ కార్య‌క్ర‌మంలో బోర్డు స‌భ్యులు, చంద్ర‌గిరి ఎం.ఎల్‌.ఏ. శ్రీ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ పోకల ఆశోక్ కుమార్‌, శ్రీ‌ మొరం శెట్టి రాములు, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, శ్రీ‌నివాస‌మంగాపురం ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, డిఇ శ్రీ ర‌విశంక‌ర్ రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.