BHASHYAKARULA SATTUMORA PERFORMED _ శ్రీవారి ఆలయంలో వేడుకగా శ్రీ భాష్యకారుల సాత్తుమొర‌

Tirumala, 18 Apr. 21: On the advent of the birth star of Sri Ramanujacharya, Arudra Nakshatra on Sunday, Bhashakarula Sattumora was observed in Tirumala.

Since the great Sri Vaishnavaite Ramanuja has written the foreword to Mimamsa as per norms of Visishtadwaita, he was known as Bhashyakarulavaru.

After Sahasra Deepalankara Seva, the deities accompanied by Sri Ramanujacharya on another Tiruchi taken on a procession along four Mada streets.

Later in the evening, Sattumora was observed at Bhashyakaulavari Sannidhi inside Tirumala temple between 7pm and 9pm.

Both the Senior and Junior pontiffs, Jeeyangars, temple staffs were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో వేడుకగా శ్రీ భాష్యకారుల సాత్తుమొర‌

తిరుమల, 2021 ఏప్రిల్ 18: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీ భాష్యకారుల సాత్తుమొర వేడుకగా జరిగింది. ఏప్రిల్ 9న ప్రారంభమైన భాష్యకారుల ఉత్స‌వాలు 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగనున్నాయి. శ్రీ రామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్ర‌తి ఏటా శ్రీ‌వారి ఆల‌యంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా ప్రసిద్ధిచెందారు.

ఈ సందర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు వైభ‌వోత్స‌వ మండ‌పంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ భాష్యకార్లవారికి విశేష స‌మ‌ర్ప‌ణ చేశారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీ భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేశారు.

రాత్రి 7 నుంచి 9 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.