BHUMI PUJA PERFORMED FOR SV TEMPLE AT KARIMNAGAR _ కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి 

Tirupati,31, May,203:  TTD chairman Sri YV Subba Reddy on Wednesday performed the bhumi puja for the construction of Sri Venkateswara temple at Karimnagar in Telangana state amidst Vedic mantras etc.

As part of the Agama traditions, archakas performed Sankalp,punya havachanam, Ganapathi puja and Viswaksena puja, before placing Nava Dhanya and four bricks on the ground.

Speaking on the occasion the TTD chairman said as per directions of AP CM Sri YS Jaganmohan Reddy, the TTD had launched the construction of SV temples all over the country as part of its Sanatana Hindu Dharma propaganda.

He said TTD was building a temple at a cost of ₹20 crores in the ten acres of land granted by Telangana CM Sri K Chandrasekar Rao. The complex consists of sub-temples for Sri Padmavati, Sri Andalamma, compound wall, parking etc. The temple is to be completed in two years and all services will be held as in Srivari temple Tirumala.

Telangana MPs Sri Damodaram,  ministers Sri Ganguli Kamalakar, State planning commission vice president Sri Vinod, TTd Hyderabad local advisory committee chairman Sri Bhaskar Rao, TTDJEO Sri Veerabrahmam, Agama advisor Sri Mohana Rangacharyulu, Srivari temple Chief archakas Sri Venugopal Dikshitulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి

తిరుపతి, 2023 మే 31: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి బుధవారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.

అర్చకులు సంకల్పం, పుణ్యాహవాచనం, గణపతి పూజ, విష్వక్సేన పూజ నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య నవధాన్యాలను భూమిలో ఉంచి ఆలయనిర్మాణానికి నాలుగు ఇటుకలు ఉంచి నాలుగు వేదాలను ఆవాహనం చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేశంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ లో ఆలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు 10 ఎకరాల భూమి కేటాయించినట్లు చెప్పారు. దాదాపు రూ .20 కోట్లతో తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఇక్కడ ఆలయం నిర్మిస్తామన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ ఆండాల్ అమ్మవారి ఉప ఆలయాలు, ఆలయం చుట్టూ ప్రహరీ గోడతో పాటు భక్తులకు సదుపాయంగా పార్కింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిపే అన్ని కైంకర్యాలు, నైవేద్యాలు ఇక్కడ కూడా జరపనున్నట్లు తెలియజేశారు. ఈ ఆలయ నిర్మాణాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని చైర్మన్ వివరించారు.

ఈ కార్యక్రమంలో రాజ్య సభ్యులు శ్రీ దామోదరం, రాష్ట్ర మంత్రి శ్రీ గంగుల కమలాకర్, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులు శ్రీ వినోద్, టీటీడీ హైదరాబాద్ స్థానిక సలహా మండలి చైర్మన్ శ్రీ భాస్కర్ రావు, టీటీడీ జెఇఓ శ్రీ వీరబ్రహ్మం, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది