BLESSED WITH SRIVARI BRAHMOTSAVA DARSHAN-DEVOTEES THANKS EO _ తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నంతో జ‌న్మ‌ధ‌న్యం – టీటీడీ ఈవో కు కృతజ్ఞతలు తెలియజేసిన భక్తులు

TIRUMALA, 02 OCTOBER 2021: With a noble aim to provide Darshan of Sri Venkateswara Swamy to the people belonging to backward areas, TTD had organized Srivari Brahmotsava Darshan which won accolades from the pilgrim quarters.

 

On Tuesday the devotees from East and West Godavaris, Krishna, Vizag etc. Who had this darshan during the annual Brahmotsavams last month, have penned a Thanksgiving letter to TTD EO Dr KS Jawahar Reddy for arranging them the divine darshan.

 

TTD in coordination with Samarasata Seva Foundation has provided darshan to nearly 7000 devotees hailing from all the 13 districts of AP during the annual fete by arranging special buses from their respective places with free lodging and boarding facility.

 

The Girijans from Paderu expressed their immense happiness that it was for the first time that they had visited Tirumala and had darshan of Srivaru.

 

Similar was the emotion shared by the villagers belonging to SC colony Burnepalli of Valmikipuram Mandal in Chittoor district. “We had a VIP darshan in our life”, the denizens of Diguvamadigapalle expressed with elation.

 

”We heard of Tirumala but we experienced practically the divinity of Bhuloka Vaikuntha in Kaliyuga”… These were the words written by the prople from backward classes of Vizag, Srikakulam and Vizianagaram.

 

A devotee from Gurrappagudem in West Godavari expressed his jubilation when he was given the news of the delivery of his wife without any difficulty soon after his darshan.

 

Samarasata Seva Foundation had constructed a Badi, Gudi and also facilitated us Darshan of Srivaru which was a memorable event in our lives stated the people of Jayaramapuram Tanda of Prakasam district.

 

“My 50years old wish fulfilled with this darshan. I tonsured my hair which was due from the past five decades, said Peddagude of Krishna district.

 

For Bhramarambika of Kurnool Kothapalle Chenchugudem, it was the grace of Chenchu Lakshmi the folk Goddess with which they had had darshan of Srivaru.

 

“We reached Tirumala from our village in Anantapuram for Srivari Brahmotsava Darshanam. Throughout our journey we sang the keertanams and Govinda namas with devotion till reached our houses back”.

 

The SSF President Sri T Vishnuklvu, Secretary Sri P Trinath, Joint Secretary Sri K Sunil Kumar compiled the experiences and emotions of the people of backward and agency areas and forwarded the letter to TTD EO.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నంతో జ‌న్మ‌ధ‌న్యం

– శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నంపై భ‌క్తుల స్పంద‌న‌

-. టీటీడీ ఈవో కు కృతజ్ఞతలు తెలియజేసిన భక్తులు

తిరుమ‌ల‌, 2021 న‌వంబ‌రు 02: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా వెనుక‌బ‌డిన పేద‌వ‌ర్గాల‌కు స్వామివారి ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించ‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తమైంది. తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదారి, కృష్ణా, వైజాగ్ లాంటి సుదూర ప్రాంతాల్లోని ఏజెన్సీల నుండి స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ స‌హ‌కారంతో ఉచితంగా బ‌స్సుల ద్వారా తిరుమ‌ల‌కు తీసుకొచ్చి శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించ‌డంపై ఆయా ప్రాంతాల భ‌క్తులు ఎంతో సంతృప్తి వ్య‌క్తం చేస్తూ టిటిడి కార్య‌నిర్వ‌హ‌ణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి మంగళవారం లేఖ ద్వారా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

వీరికి దర్శ‌నం క‌ల్పించేందుకు సమ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ అధ్య‌క్షులు శ్రీ తాళ్లూరు విష్ణువు, కార్య‌ద‌ర్శి శ్రీ పాకాల త్రినాధ్‌, స‌హ కార్య‌ద‌ర్శి శ్రీ కె.సునీల్ కుమార్ పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించ‌గా ప‌లువురు భ‌క్తులు వారి స్పంద‌నను ఈ విధంగా తెలియ‌జేశారు.

1. మేము ఇంత‌వ‌ర‌కు కొండ‌కు రాలేదు. స్వామి ద‌ర్శ‌నం ఈ జ‌న్మ‌కు అవుతుంద‌ని అనుకోలేదు. టిటిడికి రుణ‌ప‌డి ఉన్నాం.

– రంప‌చోడ‌వ‌రం, పాడేరు గిరిజ‌నులు.

2. మేము ఎస్‌సి కుల‌స్తులం. ప్ర‌తికూల ప‌రిస్థితుల వ‌ల్ల స్వామి ద‌ర్శ‌నం చేసుకోలేక‌పోయాం. కానీ మాకు విఐపి ద‌ర్శ‌నం ద‌క్కింది.

– బ‌ర్నేప‌ల్లి గ్రామం, వాల్మీకిపురం మండ‌లం, చిత్తూరు జిల్లా.

3. క‌లియుగ వైకుంఠం అంటుంటే విన్నామే కానీ, స్వామి ద‌య‌వ‌ల్ల వైకుంఠాన్ని ద‌ర్శించాం.

– శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం, పాడేరు భ‌క్తులు.

4. తిరుమ‌ల నుండి స్వ‌యంగా స్వామే మా గ్రామానికి వ‌చ్చి మ‌మ్మ‌ల్ని తీసుకెళ్లిన‌ట్టుగా మాకు అనుభూతి క‌లిగింది.

– ఎం.ధ‌న‌రాజు, బొంతివంక ఎస్‌సి కాల‌నీ, కెసి ప‌ల్లి, పెనుమూరు.

5. పెద్ద‌ల‌కు దొరికే ద‌ర్శ‌నం మాకు ద‌క్క‌డంతో జ‌న్మ ధ‌న్య‌మైంది. మిగిలిన మాలాంటి సామాన్యులకు కూడా ద‌క్కాల‌ని మా కోరిక‌.

– రామానుజుల‌మ్మ‌, దిగువ‌మాదిగ‌ప‌ల్లి, సంబేప‌ల్లి మండ‌లం, క‌డ‌ప జిల్లా.

6. 50 సంవ‌త్స‌రాల క్రితం స్వామికోసం త‌ల‌నీలాలు స‌మ‌ర్పించాల‌ని అనుకున్నాను. కొండ‌కు వెళ్లి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుట‌కు ప‌రిస్థితులు అనుకూలించ‌లేదు. ఆ మొక్కు తీర్చుకోవ‌డానికి స్వామివారు స్వ‌యంగా తీసుకెళ్లిన‌ట్టుంది.

– పెద్ద‌గూడెం, ఘంట‌సాల మండ‌లం, కృష్ణా జిల్లా.

7. ఆదివాసీలు అయిన మాకు స‌క‌ల సౌక‌ర్యాల‌తో బ్ర‌హ్మోత్స‌వాల‌లో ద‌ర్శ‌నం క‌ల‌గ‌డం స్వామి మ‌హిమే అని మా ప్ర‌గాఢ విశ్వాసం. మా సంప్ర‌దాయ ధింసా నృత్యం స్వామివారి స‌న్నిధిలో ప్ర‌ద‌ర్శ‌న చేసుకోవ‌డంతో మా జ‌న్మ ధ‌న్య‌మైంది.

– పాడేరు గిరిజ‌నులు

8. హిందూ ధ‌ర్మం అంటే మాట‌ల‌తోనే విన‌డం కానీ, తిరుమ‌లగిరుల‌పై కాలు పెట్ట‌గానే ఒక అద్భుత‌మైన అనుభూతి క‌లిగింది. ఇది మ‌రువ‌లేనిది. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో స్వామివారి ద‌ర్శ‌నం క‌లిగింది. ఇక మేము స్వామిని వ‌ద‌లం. ధ‌ర్మాన్ని వీడం.

– రంప‌చోడ‌వ‌రం గిరిజ‌నులు.

9. స్వామి ద‌ర్శ‌నం కోసం బ‌య‌లుదేరిన బ‌స్సుల్లో మ‌రియు కొండ‌పైన స్వామి భ‌జ‌న చేస్తూ, కీర్తిస్తూ, భ‌క్తితో గోవింద‌నామాలు పాడుతూ స్వామి ద‌ర్శ‌నం చేసుకున్నాం. ఇది అద్భుత‌మైన ఘ‌ట్టం.

– అనంత‌పురం జిల్లా భ‌క్తులు.

10. స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ వారు మా తాండాకు వ‌చ్చి గుడి లేని మాకు స్వామి ద‌య‌తో గుడి నిర్మాణం చేయించారు. స్వామి క‌ల్యాణం జ‌రిపించారు. మ‌మ్మ‌ల్ని అత్యంత జాగ్ర‌త్త‌గా స్వామి ద‌ర్శ‌నానికి తీసుకెళ్లారు.

-జ‌య‌రాంపురం తండా, గిద్ద‌లూరు మండ‌లం, ప్ర‌కాశం జిల్లా.

11. మాకు గుడి క‌ట్టారు, బ‌డి పెట్టారు, మాకు శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేయించారు. టిటిడి, స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ వారికి మా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు.

– నార్త్ మోపూరు, ఎస్‌సి మాల కాల‌నీ, అల్లూరు మండ‌లం, నెల్లూరు జిల్లా.

12. మాది కోయ జాతి. స్వామి ద‌ర్శ‌నానికి వెళ్లేట‌పుడు నా భార్య గ‌ర్భిణి. సుఖ‌ప్ర‌స‌వం జ‌రిగి పండంటి బిడ్డ పుట్టాల‌ని స్వామిని మొక్కుకున్నాను. ద‌ర్శ‌నం చేసుకుని తిరుగు ప్ర‌యాణంలో ఏలూరులో ఉండ‌గా బిడ్డ పుట్టిన‌ట్టు క‌బురొచ్చింది. త‌ల్లీబిడ్డ క్షేమం.

– గుర్ర‌ప్పగూడెం, బుట్టాయ‌గూడెం మండ‌లం, ప‌శ్చిమ‌గోదావ‌రి.

13. మేము చెంచులం. స్వామి ద‌ర్శ‌నం ఇక క‌లేనేమో అని అనుకున్నాం కానీ నిజ‌మైంది. మా మ‌న‌సు పుల‌కించిపోయింది. ఈ జ‌న్మ‌కు ఇదిచాలు అనిపించింది.

– ముండ్లి అంజ‌య్య‌, హ‌నుమాపురం, వెల్దుర్తి మండ‌లం, గుంటూరు.

14. మాది అడ‌వుల్లో ఉండే చెంచుగూడెం. మాకు స్వామి ద‌ర్శనం తొలిసారి. స్వామే స్వ‌యంగా పిలుచుకుని ద‌ర్శ‌నమివ్వ‌డం చెంచులక్ష్మి మ‌హిమ‌గా భావిస్తున్నాం.

– భ్ర‌మ‌రాంబిక గూడెం, కొత్త‌ప‌ల్లి మండ‌లం, క‌ర్నూలు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.