FLAIR OF BHAKTI EXUDES AT AKHANDA BALAKANDA PARAYANAM _ భక్తిభావాన్ని పంచిన బాల‌కాండ అఖండ పారాయణం

Tirumala, 2 Nov. 21: The third edition of Akhanda Balakanda parayanam was conducted at Nada Neeranjanam platform at Tirumala on Tuesday morning between 6am and 8am.

 

The program was conducted by TTD as part of its spiritual endeavour to save humanity from pandemic Corona.

 

The Vedic pundits from several institutions of Tirumala and Tirupati led by SV Vedic university Acharya Parva Ramakrishna Somayajulu performed parayanams of 163 shlokas from 8-13 sargas of Balakanda.

 

Speaking on the occasion Acharya Prava Ramakrishna Somayaji said the parayanams of Balakanda from epic Ramayana penned by sages Valmiki, Sri Tulasi Das and Sri Thyagaraja were a blessing to all devotees.

 

Among others Vedic pundits of Dharmagiri Veda Vignana Peetham, SV Vedic University and SV higher Vedic studies institute, National Sanskrit University also participated.

 

The highlight of the event was the Sankeetanas rendered by SV Music and Dance college lecturer Dr K Vandana and her team at the beginning and in the end.

 

Vice-chancellor of National Sanskrit University Acharya Muralidhar Sharma, TTD Vaikhanasa Agama Advisor Sri Mohana Rangacharyulu and OSD of Srivari Temple Sri P Sheshadri and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భక్తిభావాన్ని పంచిన బాల‌కాండ అఖండ పారాయణం

తిరుమల, 2021 నవంబరు 02: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై మంగ‌ళ‌వారం ఉద‌యం జరిగిన మూడోవిడ‌త‌ బాలకాండ అఖండ పారాయణం భక్తిభావాన్ని పంచింది. నాదనీరాజనం వేదికపై ఉదయం 6 నుండి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

బాలకాండలోని 8 నుండి 13 సర్గల వ‌ర‌కు గ‌ల 163 శ్లోకాలను ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆధ్యాప‌కులు ఆచార్య ప్ర‌వా రామ‌క్రిష్ణ సోమ‌యాజులు, ఇతర పండితులు పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య ప్ర‌వా రామ‌క్రిష్ణ మాట్లాడుతూ మధురమైన రామనామస్మరణ ఫలాన్ని శ్రీ వాల్మీకి మహర్షి, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ తులసీదాసు లాంటి మహనీయులు ఆస్వాదించి, మనందరికీ అదేమార్గాన్ని చూపారని చెప్పారు. ఆచార్య స్థానంలో ఉన్న హనుమంతుడు మనకు మంచి చెడులు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. శ్రీరాముని అవతారమైన శ్రీనివాసుని సన్నిధిలో రామాయణ పారాయణం మనందరి పూర్వజన్మ సుకృతమన్నారు.

అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.

ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి వంద‌న బృందం   ” రామ కోదండరామ రామ కల్యాణరామ…  “, అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ప్రారంభంలో,   ”  రామ రామ రామ రామ … రామనామ తారకం …….” అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ముగింపులో సుమ‌ధురంగా అల‌పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ మోహ‌నరంగాచార్యులు, శ్రీ‌వారి ఆల‌య ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.