BOOK RELEASED _ పురాణ దర్శనం పుస్తకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి

TIRUMALA, 07 OCTOBER 2021: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Thursday released “Purana Darshanam” book at Annamaiah Bhavan in Tirumala.

Speaking on the occasion he said, the book is brought out by Pavani Foundation. “They have published Astadasa Puranas in simple Telugu and brought out them in three volumes and distributing to all libraries free of cost in both the Telugu states.

The Chairman also said, the book will act as a guide to the teachers to teach Puranas to students in an easy and convenient manner. “The same institution has also published Bhagavat Gita in easy Telugu earlier and distributed to many schools across the twin Telugu states free of cost.

The Foundation Principal Secretary Sri Mutyala Naidu, representatives Sri Sambi Reddy, Sri Sesha Reddy, some of the TTD board members were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పురాణ దర్శనం పుస్తకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి

తిరుమల 7 అక్టోబరు 20 21: పావని ఫౌండేషన్ సంస్థ ముద్రించిన పురాణ దర్శనం పుస్తకం మూడు సంపుటాలను టిటిడి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి గురువారం ఆవిష్కరించారు.

అన్నమయ్య భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, పావని ఫౌండేషన్ సంస్థ అష్టాదశ పురాణాలను సరళమైన తెలుగులో మూడు సంపుటాలుగా ముద్రించి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని లైబ్రరీలు, పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేస్తోందని చెప్పారు. దీనివల్ల ఉపాధ్యాయులకు పురాణాలు సులువుగా అర్థమై వారు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ సంస్థ గతంలో భగవద్గీతను సరళమైన తెలుగు భాషలో ముద్రించి, తెలుగు రాష్ట్రాల్లోని అనేక పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేసిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉప కులపతి, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఆచార్య ముత్యాల నాయుడు, ప్రతినిధులు చల్లా సాంబిరెడ్డి, మాజీ శాసనసభ్యులు శేషారెడ్డి తో పాటు పలువురు టీటీడీ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది