PRAYED FOR SUCCESSFUL CONDUCT OF NAVAHNIKA BRAHMOTSAVAMS- CHAIRMAN _ బ్రహోత్సవాలు విజయవంతంగా ముగియాలని శ్రీవారిని ప్రార్థించా – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
TIRUMALA, 07 OCTOBER 2021: TTD Chairman Sri YV Subba Reddy said that he prayed Sri Venkateswara Swamy towards the successful conduct of nine-day annual Brahmotsavams without any problem.
After Dhwajarohanam talking to media persons outside temple, the Chairman said though TTD initially planned of organizing the annual mega religious fete in a big manner, due to covid restrictions it has been decided to observe in Ekantam keeping in view the safety of pilgrims as well TTD employees.
However, he said, TTD is telecasting every important ritual in live through SVBC for the sake of global devotees.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
బ్రహోత్సవాలు విజయవంతంగా ముగియాలని శ్రీవారిని ప్రార్థించా- టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుమల 7 ఆక్టోబరు 2021: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చిన్న ఇబ్బంది కూడా లేకుండా విజయవంతంగా ముగియాలని స్వామి వారిని ప్రార్థించానని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం గురువారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం చైర్మన్ తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కారణంగా ఈ సారి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.భక్తులు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వాహన సేవలు వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది