BOOK RELEASED _ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ దాన పత్రాలు పుస్తకావిష్కరణ

TIRUPATI, 17 MAY 2023: A book titled  “Matrusri Tarigonda Vengamamba Danapatralu” was released by TTD EO Sri AV Dharma Reddy at Sri Padmavathi Rest House in Tirupati on Wednesday.

The book was penned by SVBC Chairman Dr Saikrishna Yachendra and TTD Chief Museum Officer Dr Nagolu Krishna Reddy which included the 33 manuscripts related to the various donations made by various donors hailing from Chittoor, Tamilnadu, Karnataka etc.

With these donations comprising of kind and cash, Vengamamba did observe Narasimha Jayanti every year in Tirumala. Many such interesting details are compiled in this book.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ దాన పత్రాలు పుస్తకావిష్కరణ

తిరుపతి 17 మే 2023: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ దానపత్రాలు పుస్తకాన్ని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బుధవారం టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఆవిష్కరించారు.

డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర, డాక్టర్ నాగోలు కృష్ణారెడ్డి ఈ పుస్తకాన్ని రచించారు.
శ్రీవెంగమాంబ కాలానికి సంబంధించిన 33 దాన శాసనాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ధన,వస్తు రూపంలో ఇచ్చిన దానాలకు సంబంధించిన శాసనాలను పరిష్కరించి ఈ పుస్తకంలో పొందుపరచారు. ఈ విరాళాల ద్వారా ఆమె తిరుమలలో ప్రతి ఏటా పది రోజుల పాటు నృసింహ జయంతి ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించేవారని దాన పత్రాల్లో ఉంది. ఉత్సవాల రోజుల్లో పేదలకు అన్నదానం, చలి వేంద్రాలు మొదలైన ధర్మ కార్యాలు నిర్వహించేవారని ఇందులో ఉంది. స్వీకరించిన దాదాపు 33 దానాలకు సంబంధించి దానకర్త పేరు, దాన విషయం మొదలైన విషయాలన్నీ ఇందులో పొందు పరచబడ్డాయి.

జేఈవో లు శ్రీమతి సదాభార్గవి, శ్రీవీరబ్రహ్మం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది