BTU OF CHANDRAGIRI TEMPLE FROM APRIL 10-19 _ ఏప్రిల్ 10 నుండి 19వ తేదీ వ‌ర‌కు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 17 Mar. 22: TTD is organising the annual Brahmotsavam of Sri Kodandarama Swamy temple at Chandragiri from April10-18 with Ankurarpanam fete on April 9 evening.

 

As part of celebrations, the Dwajarohanam fete will be performed in Mithun lagnam on April 10 evening.

 

The vahana sevas of the Brahmotsavam are as below.

 

April 14: Hanumanta vahana (night)

April 16:Sri Sitaram Kalyanotsavam (morning) and Garuda Vahana at night.

April 18: Chakra snanam for utsava idols of Swamy and Ammavaru and Dwajavarohanam at night.

April 19: Sri Rama Pattabhisekam.

 

Meanwhile devotees keen to participate in the Sri Rama Kalyanotsavam could buy 750 per couple.

 

As part of celebrations the artists of HDPP, Dasa Sahitya project, Annamacharya project will perform bhajans, Hari Kathas and sankeetans.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 10 నుండి 19వ తేదీ వ‌ర‌కు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 మార్చి 17: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు అంకురార్ప‌ణ‌తో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి.

ఇందులో భాగంగా ఏప్రిల్ 10వ తేదీ ఉద‌యం 7 నుండి 7.45 గంట‌ల మ‌ధ్య‌ మిథున ల‌గ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు.

ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7.45 గంటల వరకు శ్రీ కోదండ రామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 16వ తేదీ ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు శ్రీసీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.

ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌ర్ల‌కు, చక్రత్తాళ్వార్‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, ఉద‌యం 10 నుండి 10.30 గంటల వ‌ర‌కు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఏప్రిల్ 19వ తేదీ సాయంత్రం 5.45 నుండి రాత్రి 7.00 గంటల వరకు శ్రీ రామ పట్టాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు.

కాగా, ఏప్రిల్ 16న ఉద‌యం 10 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, సంగీత కచేరీలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.