ANKURARPANAM ON MARCH 18 FOR MAHA SAMPORKSHANA FETE AT VIZAG SRIVARI TEMPLE _ మార్చి 18న విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు అంకురార్ప‌ణ‌

Tirupati, 17 Mar. 22: The auspicious fete of Ankurarpanam will be held on March 18, Friday, ahead of Maha Samprokshana celebrations of the newly built Sri Venkateshwara temple at Visakhapatnam.

In this connection, the rituals of Acharya Ritwik varanam, Mrutsya grahanam and Ankurarpanam will be conducted on March 18 night between 7.00-10.00 pm.

The Vigraha Pratista and Maha Samprokshana will be performed on March 23 mornings and later devotees darshan will commence from Afternoon.

Later in the evening, the TTD is organising a spectacular glittering fete of Srivari Kalyanotsavam will be conducted.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 18న విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2022 మార్చి 17: విశాఖ‌ప‌ట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో మార్చి 18వ తేదీ రాత్రి 7 గంట‌ల‌కు అంకురార్ప‌ణతో మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌వుతాయి.

ఇందులో భాగంగా మార్చి 18వ తేదీన శుక్ర‌వారం రాత్రి 7 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

మార్చి 23వ తేదీన‌ ఉద‌యం 9 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 1.30 నుండి సాయంత్రం 6.30 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. సాయంత్రం 3 నుండి 4.15 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం జ‌రుగ‌నుంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.