ARJITA SEVA ONLINE QUOTA RELEASE ON MARCH 20 _ మార్చి 20న ఆన్‌లైన్‌లో శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు విడుద‌ల‌

Tirumala, 17 Mar. 22: As part of TTD’s decision to resume all arjita sevas from April 1, the online Arjita Seva quota for April, May and June shall be released at 10.00 am on March 20.

In a statement on Thursday, the TTD said devotees should book their arjita Seva tickets on the official portal of www.tirupatibalaji.ap.gov.in and observe mandatory Covid-19 guidelines for Srivari Darshan.

The arjita seva tickets of Suprabatham, Tomala, Archana, Astadala Pada padmaradana, Nija pada Darshan will be released on online electronic dip system.

For booking these arjita Seva tickets the devotees should register online between March 20 morning 10.00 am to March 22 morning 10.00 am and later on tickets are released in electronic dip system and those allotted tickets shall be declared after 10.00 am of March 22 and notified on TTD website besides informing the devotees on SMS and email. The devotees should pay the cost of tickets within two days, the TTD said.

However, the arjita Seva tickets of Kalyanotsavam, Unjal Seva arjita Brahmotsavam etc. are directly booked and allotted to devotees on, a first-come-first-served basis.         

ARJITA SEVAS SUSPENDED ON FESTIVE DAYS

TTD appealed to devotees to take note of the cancellation of certain arjita sevas on the below festive day:

April 2:Ugadi Kalyanotsavam, Unjal seva and arjita Brahmotsavam.

April 10: Sri Rama Navami: Tomala, Archana, Sahasra Deepalankara:

April 24-16: Vasantothsavam; Kalyanotsavam Unjal seva, arjita Brahmotsavam and Sahasra Deepalankara sevas.

April 15: Nija pada Darshana

May 20-12: Sri Padmavati Parinayotsavam; Arjita Brahmotsavam and Sahasra Deepalankara.

June 14: Jyestabhisekam third day: Asta Dala Padmaradhana, Kalyanotsavam, Unjal seva, arjita Brahmotsavam.

COVID NEGATIVE CERTIFICATES COMPULSORY:

TTD has appealed that Devotees coming for Srivari Darshan should compulsorily possess either Covid-19 negative certificate or certificate for 2 doses of vaccination.

TTD has appealed that devotees should cooperate and take all precautionary steps with regard to their health and also that of TTD employees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 20న ఆన్‌లైన్‌లో శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు విడుద‌ల‌

తిరుమ‌ల‌, 2022 మార్చి 17: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభించి భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల‌కు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల‌ను మార్చి 20వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. భ‌క్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవ‌చ్చు. కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు.

సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, నిజ‌పాద ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఆన్‌లైన్ ఎల‌క్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవ‌ల‌ను బుక్ చేసుకునేందుకు మార్చి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌ నుండి మార్చి 22వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు గృహ‌స్తులు ఆన్‌లైన్‌లో న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ఎల‌క్ట్రానిక్ డిప్ విధానంలో గృహ‌స్తుల‌కు టికెట్ల కేటాయింపు జ‌రుగుతుంది. టికెట్లు పొందిన‌వారి జాబితాను మార్చి 22వ తేదీ ఉద‌యం 10 గంట‌ల త‌రువాత వెబ్‌సైట్‌లో పొందుప‌రుస్తారు. అదేవిధంగా గృహ‌స్తుల‌కు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా తెలియ‌జేస్తారు. టికెట్లు పొందిన గృహ‌స్తులు రెండు రోజుల్లోపు టికెట్ ధ‌ర చెల్లించాల్సి ఉంటుంది.

కాగా, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల‌ను ముందు వ‌చ్చిన వారికి ముందు అనే ప్రాతిప‌దిక‌న‌ భ‌క్తులు నేరుగా బుక్ చేసుకోవ‌చ్చు.

ప‌ర్వ‌దినాల్లో ప‌లు ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

ఏప్రిల్ 2న ఉగాది సంద‌ర్భంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఏప్రిల్ 10న శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా తోమాల‌, అర్చ‌న‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ, వ‌సంతోత్స‌వాల సంద‌ర్భంగా ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవల‌ను, ఏప్రిల్ 15న నిజ‌పాద ద‌ర్శ‌నం సేవ‌లను టిటిడి ర‌ద్దు చేసింది. అదేవిధంగా, శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్స‌వాల సంద‌ర్భంగా మే 10 నుండి 12వ తేదీ వ‌ర‌కు ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవలు, జూన్ 14న జ్యేష్టాభిషేకం మూడో రోజున అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌లు ర‌ద్ద‌య్యాయి. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌గ‌ల‌రు.

నెగెటివ్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రి

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ రెండు డోసుల వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది. భక్తులు త‌మ‌ ఆరోగ్యం, అదేవిధంగా టిటిడి ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.