CALENDARS-DIARIES RELEASED _ 2023 టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

CM PERFORMS TULABHARAM

TIRUMALA, 27 SEPTEMBER 2022: After the darshan of Srivaru, the Honourable CM of AP Sri YS Jaganmohan Mohan Reddy offered Tulabharam in Srivari temple.

 

The CM donated a bag of rice equivalent to his weight.

 

Earlier he has also released the calendars and diaries of 2023.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2023 టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

సెప్టెంబర్ 27, తిరుమ‌ల 2022: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో మొద‌టి రోజైన మంగ‌ళ‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టిటిడి ముద్రించిన 2023వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.

12 పేజీల క్యాలెండర్లు 13 లక్షలు, 6 పేజీల క్యాలెండ‌ర్లు 50 వేలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 2.50 ల‌క్ష‌లు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టిటిడి ముద్రించింది. క్యాలెండ‌ర్లు, డైరీలు తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ఇత‌ర ప్రాంతాల్లోని టిటిడి స‌మాచార కేంద్రాల్లో త్వ‌ర‌లో అందుబాటులో ఉంచుతారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.