AP CM PRESENTS SILK VASTRAMS TO SRI VENKATESWARA _ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

TAKES PART IN PEDDASESHA VAHANAM

 

Tirumala, 27 September 2022: As part of tradition during Srivari annual Brahmotsavam Honourable AP CM Sri YS Jaganmohan Reddy on Monday evening presented official silk vastrams to Sri Venkateshwara.

The CM offered prayers at Bedi Anjaneya temple. Thereafter he carried the official offerings of silk vastrams on his head in a platter along with pundits chanting Veda mantras and accompanied by Mangala Vaidyams.

Later the CM offered prayers to Sri Venkateswara. Thereafter Vedic pundits offered him ashirvachanam at Ranganayakula Mandapam and was also presented Srivari Thirtha Prasadams.

Later he also participated in the first Vahana Seva of annual fete, the Pedda Sesha Vahanam.

MPs Sri Gurumurthy, Sri Mithun Reddy, Sri Reddeppa, Sri Prabhakar Reddy, AP Deputy CMs Sri Narayana Swami, Sri Satyanarayana, Sri.Ramachandra Reddy, Smt Roja, Sri Venugopala Krishna, Tirupati MLA Sri Bhumana Karunakar Reddy, several other dignitaries, several TTD board members,JEO s Smt Sada Bhargavi and Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore and others were also present.

Dr KS Jawahar Reddy, Special CS to CM, Additional PS Sri Nageswara Reddy, DIG Sri Raviprakash, District collector Sri Venkataramana Reddy, SP Sri Parameshwar Reddy and other officers from state and district were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

సెప్టెంబర్ 27, తిరుమ‌ల 2022: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన మంగ‌ళ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ముందుగా గౌ|| ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆ తరువాత గౌ|| ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ సత్యనారాయణ, శ్రీ వేణుగోపాలకృష్ణ, శ్రీమతి రోజా, ఎంపిలు శీ మిథున్ రెడ్డి, శ్రీ రెడ్డెప్ప, తిరుప‌తి ఎమ్మెల్యే శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.