DHWAJAVAROHANAM MARKS CONCLUSION OF KRT BTU _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుపతి, 2025 ఏప్రిల్ 04: తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 8.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం . ఈ కార్యక్రమంలో […]
