ఏప్రిల్ 11న తితిదే ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
ఏప్రిల్ 11న తితిదే ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు తిరుపతి, ఏప్రిల్ 09, 2013: శ్రీ విజయనామ సంవత్సరం ఉగాది సంబరాలను ఏప్రిల్ 11న ఘనంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉగాది సంబరాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం పంచాంగశ్రవణం, వస్త్రసమర్పణ నిర్వహించనున్నారు.తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఉగాది సందర్భంగా సాయంత్రం 4.00 గంటలకు సభ నిర్వహించనున్నారు. తితిదే అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు […]
