SARVA DARSHANAM ON JAN 1 TO COMMENCE FROM 4.30AM ONWARDS_ జనవరి 1న ఉదయం 4.30 గం||ల నుండి భక్తులకు సర్వదర్శనం : టిటిడి తిరుమల ఇన్‌చార్జి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirumala, 30 Dec. 18: In connection with January 1 on New Year’s Day, Sarva Darshanam for pilgrims will commence from 4.30am onwards, said Tirumala Incharge JEO Sri P Bhaskar.

The TTD JEO inspected Vaikuntham Queue Complex on Sunday and reviewed with officials on the New Year Day arrangements in Gokulam Rest House. Later speaking to media persons he said, TTD has cancelled all arjitha devas and privilege darshans in view of the first day of New Year 2019.

He said, the VIP Break Darshanam is limited only to protocol VIPs on January 1 and it will commence by 2am. The Sarva Darshanam to common devotees will commence by 4.30am onwards.

All departments were instructed to work as a team and offer services to pilgrims who visit Tirumala on New Year Day to have darshanam of Lord Venkateswara, he maintained.

CVSO Sri Gopinath Jetti, SEs Sri Ramachandra Reddy, Sri Ramesh Reddy, VGOs Sri Manohar, Sri Prabhakar, DyEOs Sri Harindranath, Sri Balaji, Smt Goutami, Health Officer Dr Sermista, Anna prasadam Special Officer Sri Venugopal and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జనవరి 1న ఉదయం 4.30 గం||ల నుండి భక్తులకు సర్వదర్శనం : టిటిడి తిరుమల ఇన్‌చార్జి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుమల, 2018 డిసెంబర్‌ 30: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 1వ తేదీన ఉదయం 4.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభిస్తామని టిటిడి తిరుమల ఇన్‌చార్జి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఆదివారం నాడు జెఈవో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ జనవరి 1న తిరుమలకు విశేషంగా విచ్చేసే భక్తుల రద్దీని ద ష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామన్నారు. బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు పరిమితం చేశామని, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేశారు. టిటిడి అధికారులు, సిబ్బందికి సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.

టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసుల సమన్వయంతో చిన్నారి కిడ్నాప్‌ కేసు ఛేదన : టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి

టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు సమన్వయం చేసుకుని తిరుమలలో కిడ్నాప్‌నకు గురైన చిన్నారి కేసును ఛేదించామని టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి తెలిపారు. తిరుమలలో ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది సిసిటివి ఫుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారని, దీంతో కిడ్నాప్‌ కేసును త్వరగా ఛేదించగలిగారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించిన టిటిడి నిఘా, భద్రతా సిబ్బందికి, పోలీసులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న తిరుమలలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా, నిరంతరం పర్యవేక్షణతో ఉండాలని ఈ సందర్భంగా సివిఎస్‌వో విజ్ఞప్తి చేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.