CHAIRMAN DINES AT MTVAC _ అన్న ప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్
TIRUMALA, 06 NOVEMBER 2024: TTD Chairman Sri BR Naidu inspected Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex on Wednesday evening.
The TTD board chief arrived at MTVAC along with his family members and dined along with the devotees.
Annaprasadam DyEO Sri Rajendra explained the TTD Chairman about the Annaprasadam activities including the capacity of each hall, menus being served to the devotees, timings of MTVAC and others.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్న ప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్
తిరుమల, 2024 నవంబరు 06: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనాన్ని బుధవారం రాత్రి టీటీడీ నూతన చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు.
డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర అన్న ప్రసాదం కార్యాకలాపాలను చైర్మన్ కు వివరించారు. అన్న ప్రసాద భవనంలో ఒకరోజులో ఎంతమంది భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరిస్తారు, అందిస్తున్న వివిధ రకాలైన ఆహార పదార్థాలు, అన్న ప్రసాద భవనం పని చేసే వేళలు తదితర విషయాల గురించి సవివరంగా తెలియజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.