PROTECTING SANCTITY OF TIRUMALA IS OUR TOP MOST PRIORITY-TTD NEW TRUST BOARD CHIEF _ తిరుమల పవిత్రతను కాపాడుకోవడమే మా ప్రాధాన్యత- టీటీడీ నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీ బి.ఆర్.నాయుడు
TAKE FORWARD EFFECTIVE PILGRIM MEASURES WITH TEAMWORK
COMPLIMENTS TTD FOR CONDUCTING HASSLE-FREE BRAHMOTSAVAMS
TIRUMALA, 06 NOVEMBER 2024: The top most priority of the present TTD Trust Board is to safeguard the Sanctity of the world-renowned Hindu Pilgrim Centre, Tirumala and provide hassle-free darshan to the multitude of visiting pilgrims to the Hill Town, asserted Sri B Rajagopala Naidu, the new Trust Board Chairman of Tirumala Tirupati Devasthanams(TTD).
Addressing his maiden media conference at Annamaiah Bhavan in Tirumala on Wednesday evening, the TTD Board Chief has thanked the Honourable CM of Andhra Pradesh Sri Nara Chandra Babu Naidu for selecting him to the coveted post which used to be his long pending dream. “I used to offer prayers to Sri Venkateswara Swamy every year trekking the footpath route since I my childhood. Today, Sri Venkateswara Swamy blessed me with this rare opportunity of serving His abode and offer service to the millions and millions of devotees visiting Tirumala. For achieving this divine goal I need the support of the entire work force of TTD and media, he maintained.
Later he said, upon the instructions of CM of AP, TTD mandarins have successfully conducted the annual brahmotsavams during last month in Tirumala and he aspired same team work will be continued to execute many more pilgrim-friendly initiatives during his term to uphold the sanctity of Tirumala.
Earlier, the Chairman had an introductory session with all the senior officers of TTD. The TTD EO Sri Syamala Rao presented a brief PPT on the various activities of TTD and explained the importance of each department including the Tirumala temple, local temples, Annaprasadam, Vigilance, Health, Transport and IT, Gosala, Garden and Forests, Educational institutions and hospitals, medical, PR wing, Reception, Kalyanakatta, Hindu Dharmic Projects in the massive religious organisation besides taking care of the pilgrim darshan, accommodation and other facilities. He said, TTD is like an ocean and is like a mini-state government and highlighted the dedication of the employees in taking forward the reputation of the institution at all levels with their commitment.
Additional EO Sri Ch Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, CVSO Sri Sridhar, DLO Sri Varaprasada Rao, FACAO Sri Balaji, CE Sri Satyanarayana, other departmental HoDs were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల పవిత్రతను కాపాడుకోవడమే మా ప్రాధాన్యత
టీటీడీ నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీ బి.ఆర్.నాయుడు
• భక్తులు సేవకు సమిష్టి కృషి చేయాలి
• అవాంతరాలు లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన అధికారులకు అభినందనలు
తిరుమల, 2024 నవంబరు 06: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడుకోవడమే ప్రస్తుత టీటీడీ ధర్మకర్తల మండలి ప్రాధాన్యత అని టీటీడీ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు తెలియజేశారు. ప్రమాణస్వీకారం అనంతరం బుధవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆయన తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. తాను చిన్నప్పటి నుండే ప్రతి సంవత్సరం శ్రీవేంకటేశ్వర స్వామిని కాలినడకన వచ్చి దర్శించుకునేవాడినని, ప్రస్తుతం తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సేవ చేసుకునే అరుదైన అవకాశాన్ని శ్రీవారు ప్రసాదించడం పూర్వజన్మ సుకృతమన్నారు. భక్తులకు సేవ చేసేందుకు మీడియాతో సహా ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని కోరారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గత నెలలో బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అధికారులు సమిష్టి కృషిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
అంతకుముందు టీటీడీ సీనియర్ అధికారులందరితో చైర్మన్ పరిచయ సమావేశం నిర్వహించారు. టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు టీటీడీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సమర్పించారు. తిరుమల ఆలయం, స్థానిక దేవాలయాలు, అన్నప్రసాదం, విజిలెన్స్, ఆరోగ్యం, రవాణా, ఐటి, గోశాల, ఉద్యానవనం, అటవీ శాఖ, విద్యాసంస్థలు ప్రాముఖ్యతను వివరించారు.
ఆసుపత్రులు, మెడికల్, పిఆర్ వింగ్, రిసెప్షన్, కళ్యాణకట్ట, హిందూ ధార్మిక ప్రాజెక్టులు, యాత్రికుల దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలను చూసుకోవడంతో పాటు తమ నిబద్ధతతో సంస్థ ఖ్యాతిని అన్ని స్థాయిలలో ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగులు అంకితభావంతో ఉన్నారని ఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ శ్రీధర్, డిఎల్‌ఓ శ్రీ వరప్రసాదరావు, సిఈ శ్రీ సత్యనారాయణ, పలువురు బోర్డు సభ్యులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.