CHAIRMAN DONATES COW AND CALF TO TEMPLES _ రాజమండ్రి, కాకినాడలో గుడికో గోమాత కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్

Tirumala, 20 Jan. 21: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Wednesday donated a Cow and calf each to the famous Shiva temples located at Rajahmundry and Kakinada Rural.

Speaking on the occasion he said as part of Hindu Sanatana Dharma, TTD has taken up a unique programme called Gudiko Gomata by presenting a cow and calf to every temple as a part of the mission. 

Later he performed Go puja in both the shrines of Sri Markandeya Swamy and also in Sri Katyayani Sameta Maha Sahasra Lingeswara Swamy temple.

Ministers of AP, Sri Kanna Babu, Sri Venugopala Krishna, and Public Representatives including MPs Sri Bharat, Sri Subhash Chandra Bose, MLAs Sri Chandrasekhar Reddy, Sri J Raja, Sri T Venkata Rao, Collector Sri Muralidhar Reddy and temple authorities were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

రాజమండ్రి, కాకినాడలో గుడికో గోమాత కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్

తిరుమల 20 జనవరి 2021: రాజమండ్రి లోని శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయం , కాకినాడ రూరల్ మండలం సూర్యాపేట లోని శివాలయం లో బుధవారం గుడికో గోమాత కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

శ్రీ ఉమా మార్కండేయ ఆలయానికి చేరుకున్న టీటీడీ చైర్మన్ కు ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారి దర్శనం చేయించారు. అనంతరం శ్రీ సుబ్బారెడ్డి గుడికో గోమాత ద్వారా ఆలయానికి అందిస్తున్న గోమాత, దూడ కు పూజలు చేశారు.

కాకినాడ రూరల్ మండలం సూర్యాపేటలోని శ్రీ కాత్యాయిని సమేత మహా సహస్ర లింగేశ్వరాలయంలో అర్చకులు, అధికారులు శ్రీ సుబ్బారెడ్డికి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తరువాత శ్రీ సుబ్బారెడ్డి గోమాత, దూడ కు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం ఆలయానికి గోవు, దూడను అందించారు.

ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గోవు, దూడలు పొందిన ఆలయాలు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ దేశ వ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం నిర్వహిస్తోందని చెప్పారు.

కార్యక్రమాల్లో మంత్రులు శ్రీ కన్న బాబు, శ్రీ వేణుగోపాల కృష్ణ,ఎంపీలు శ్రీ మార్గాని భరత్, శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్, శాసన సభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి, శ్రీ జక్కంపూడి రాజ, శ్రీ తలారి వెంకట్రావు, జిలా కలెక్టర్ శ్రీ మురళీధర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది