ANNUAL BRAHMOTSAVAMS OF SKVST IN EKANTAM _ ఏకాంతంగా శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు : జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
Tirupati, 20 Jan. 21: The annual brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram will be observed in Ekantam from March 2 to 10 with Ankurarpanam on March 1, said JEO Sri P Basanth Kumar.
After reviewing with the officials over the arrangements for the ensuring brahmotsavams he said in view of Corona covid-19 vaccine programming across the country the Brahmotsavams will be observed in Ekantam only this year.
The JEO said the important days includes Dhwajarohanam on March 2, Garuda Seva on March 6, Vasanthotsavam on March 7, Chakrasnanam on March 10.
However, the JEO said, all the major events will be telecasted live on SVBC for the sake of devotees.
CE Sri Ramesh Reddy, SEs Sri Jagadishwar Reddy, Sri Venkateswarulu, GM Sri Sesha Reddy, DyEOs Sri Harindranath, Smt Shanti, Additional HO Dr Sunil, VGO Sri Manohar were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఏకాంతంగా శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు : జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
తిరుపతి, 2021 జనవరి 20: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కోవిడ్ -19 నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టిటిడి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ తెలిపారు. టిటిడి పరిపాలన భవనంలో బుధవారం సాయంత్రం జెఈవో తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్నందున ఈ ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 1న అంకురార్పణ, మార్చి 2న ధ్వజారోహణం, మార్చి 6న గరుడవాహనం, మార్చి 7న వసంతోత్సవం, మార్చి 10వ తేదీ చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. వాహన సేవలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతి రోజు సాయంత్రం నిర్వహించే ఊంజల సేవలో ప్రముఖ కళాకారులతో అన్నమయ్య సంకీర్తనలు ఏర్పాటు చేయాలని అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌కు సూచించారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఎస్వీబీసీలో ప్రోమో ప్రసారం చేయాలన్నారు. ఆలయంలో గార్డెన్ విభాగం ఆధ్యర్యంలో సుందరంగా పుష్పలంకరణలు చేపట్టాలన్నారు. పారిశుధ్యానికి అవసరమైన అదనపు సిబ్బందిని, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో సిఇ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ఇ -1 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఎస్ఇ శ్రీ వెంకటేశ్వర్లు, అదనపు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఎస్టేట్ అధికారి శ్రీ మల్లిఖార్జున, రవాణావిభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, విజివో శ్రీ మనోహర్, ఏఈవో శ్రీ ధనంజయులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.