CHAKRASNANAM HELD _ టీటీడీ స్థానికాలయాల్లో చక్రస్నానం
టీటీడీ స్థానికాలయాల్లో చక్రస్నానం
తిరుపతి, 2025 జనవరి 11: వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాలలో శనివారం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం ఉదయం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు వేడుకగా తిరుమంజనం, అనంతరం చక్రస్నానం నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
శ్రీనివాసమంగాపురం
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్ర, శనివారాల్లో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఉదయం చక్రత్తాళ్వార్ కు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
అప్పలాయగుంటలోని
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం స్నపన తిరుమంజనం, అనంతరం చక్రస్నానం నిర్వహించారు.
అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం, నారాయణవనం, నాగలాపురం, తొండమనాడు ఆలయాల్లో విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది