CHATURMASA DEEKSHA OF TIRUMALA PONTIFFS COMMENCES_ తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ చాతుర్మాస దీక్ష సంకల్పం
Tirumala, 21 Jul. 19: The Chaturmasa Deeksha of HH Tirumala Sri Pedda Jiyar Swamy and HH Sri Chinna Jiyar Swamy commenced on a religious note in hill town on Sunday.
Speaking on the occasion Sri Pedda Jiyar Swamy stated that as per Hindu tradition, the day on which Lord Maha Vishnu entered into His celestial sleep upto the day on which He wakes up is been stated as Chaturmasa and the saintly persons usually strictly observe the Japa, tapa with food restrictions during this period for the benefit of entire mankind.
Sri Chinna Jiyar said that from the day of Ashada Suddha Ekadasi till Karthika Suddha Ekadasi is considered as Chaturmasa.
Special Officer of Tirumala, Sri AV Dharma Reddy said the holy months Aswayuja, Sravana, Bhadrapada and Karthika months are being categorised as Chaturmasas and the religious persons observe strict traditional habits during this time period.
Earlier, Sri Pedda Jiyar along with Sri Chinna Jiyar Swamy started from Pedda Jiyar Mutt and in a procession following tradition offered prayers to Swamy Pushkarini and Sri Bhu Varahaswamy temples and then reached Tirumala temple.
On his arrival at Mahadwaram, he was given traditional welcome with melas. Special Officer Sri A V Dharma Reddy, CVSO Sri Gopinath Jatti and others were also present.
After darshan of Lord Venkateswara, Sri Pedda Jiyar Swamy was presented with Melchat Vastram and Sri Chinna Jiyar Swamy with Nulchat Vastram.
Later, the Jiyar Swamys felicitated SO and CVSO in Pedda Jiyar mutt. DyEO Sri Harindranath, VSO Sri Manohar were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ చాతుర్మాస దీక్ష సంకల్పం
తిరుమల, 2019 జూలై 21: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని, చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుందని వివరించారు.
అనంతరం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి మాట్లాడుతూ రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా గురు పూర్ణిమ తర్వాత సుముహూర్తంలో ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారన్నారు.
టిటిడి టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి మాట్లాడుతూ హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కల్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
అంతకుముందు శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారి ఆలయాన్ని సందర్శించారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.
శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్ వస్త్రాన్ని, శ్రీచిన్నజీయంగారికి నూలుచాట్ వస్త్రాన్ని బహూకరించారు.
అనంతరం శ్రీపెద్దజీయర్ మఠంలోశ్రీ చిన్నజీయంగార్ కలిసి తిరుమల ప్రత్యేకాధికారి, సివిఎస్వోని శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్ స్వామి భక్తులకు కొబ్బరికాయాలను బహూకరించారు. ఈ కొబ్బరికాయలను ఇంటిలో ఉంచుకుంటే ఆయురారోగ్యలు, అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, విజివో శ్రీ మనోహర్, ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, పేష్కార్ శ్రీ లోకనాథం, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.