LORD VENKATESWARA NAMA JAPA IS THE PATH FOR MOKSHA-SEER_ శ్రీ‌వారిని ఆశ్రయించడమే మోక్షసాధనకు మార్గం – శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ

Tirumala, 21 Jul. 19: The Pontiff of Kukke Subrahmanya in Karnataka, HH Sri Vishwaprasanna Theertha Swamiji advocated that in Kaliyuga the only way to get salvation is through Venkateswara nama japam.

During his religious discourse on second day on Sunday as a part of Jayatheertha Aradhanotsavams at Asthana Mandapam in Tirumala on Sunday, he said, Jayatheertha during his earlier incarnation was an ox and learnt all the teachings of Sri Madhwacharya. Later he has penned many great works. In the later years Sri Purandhara Dasa propagated the essence of these works through his versatile sankeertans.

Dasa Sahitya Project special officer Dr PR Anandatheerthacharyulu, Spl. Gr. DyEO Smt Parvathi and others took part.

Over 2500 bhajan troupes from AP, TS, TN, Karnataka and Maharashtra also participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారిని ఆశ్రయించడమే మోక్షసాధనకు మార్గం – శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ

తిరుమల, 2019 జూలై 21: కలియుగంలో తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాద‌ప‌ద్మాల‌ను ఆశ్రయించడం ద్వారా స‌ఖ‌ల జీవ‌కోటికి మోక్షం సిద్దిస్తుంద‌ని కుక్కెకి చెందిన సుబ్రహ్మణ్య పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలలో భాగంగా రెండ‌వ రోజు ఆదివారంనాడు ఘనంగా జ‌రిగాయి.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ మంగళశాసనాలు చేస్తూ భ‌గ‌వంతుడిని చేరుకోవ‌డానికి భ‌క్తి, జ్ఞాన, వైరాగ్యాలు ముక్తి కార‌కాల‌న్నారు. స్వామివారిని శరణాగత భక్తితో కొలిస్తే తప్పక కరుణిస్తాడని చెప్పారు.

భగవంతుని నామసంకీర్తన కలియుగంలో అత్యంత ఉత్కృష్టమైన భక్తి మార్గమన్నారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి తత్త్వన్ని, వైభవాన్ని, వేంకటాచల మహత్యాన్ని స్వామిజీ భక్తులకు విశదీకరించారు. హ‌రిదాసులైన శ్రీ జయతీర్థులవారు, శ్రీ వ్యాస‌రాజులు, శ్రీ పురంద‌ర‌దాసులు, శ్రీ క‌న‌క‌దాసులు, శ్రీ త్యాగ‌రాజ‌స్వామివారు హ‌రిత‌త్వాన్ని సామాన్య ప్రజల్లో విశేషంగా వ్యాప్తి చేశార‌ని తెలిపారు.

ద్వైతసిద్ధాంత ప్రతిష్టాపనాచార్యులైన శ్రీ మధ్వాచార్యులు ఆసేతు హిమాచలం సంచరించి శిష్యులకు సత్‌ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ 37 గ్రంథాలకు పైగా రచించార‌న్నారు. శ్రీవారి భక్తుడైన శ్రీ జయతీర్థులవారు పూర్వజన్మలో వృషభరూపంలో శ్రీ మధ్వాచార్యుల సన్నిధిలో ఉంటూ ద్వైత సిద్ధాంతభావాన్ని పూర్తిగా శ్రవణం చేసిన ప్రభావంతో తరువాత జన్మలో ఈ గ్రంథాలకు ‘న్యాయసుధ’ పేరుతో వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించిన‌ట్లు వివ‌రించారు. వీరి సాహిత్యాన్ని శ్రీపురందరదాస గ్రహించి వేల కీర్తనలు రచించార‌న్నారు.

ఈ సంద‌ర్బంగా దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు. ఇందులో నారాయణ గోవింద జయ జయ…., గురుపురందర దాసరే…., హరినారాయణ…., లక్ష్మి బారమ్మ…, నంద నందన బారో…, తదితర కీర్తనలు భక్తి సాగరంలో ముంచెత్తాయి.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, ఇత‌ర అధికారులు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 2,500 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.